Online Puja Services

భీష్మ ఏకాదశి

18.117.8.41
భీష్మ ఏకాదశి:

పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా, "భీష్ముడు" అనే పాత్ర లేకపోతే భారతమే లేదు!

గంగా, శంతనుల అష్టమ పుత్రుడు. ఇతని అసలు పేరు "దేవవ్రతుడు''. 
వార్ధక్యదశలో శంతనుడు, సత్యవతి సౌందర్యానికి దాసుడై, మన్మథవశవర్తియై, విరహవేదనతో వ్యాకుల శయ్యాగతుడైతే, 
ఈ సంగతి తెలిసిన "దేవవ్రతుడు'' తన తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, 
"నా జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు'' అని సత్యవతికి ప్రతిజ్ఞ చేసి .. ఆజన్మాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన "భీష్ము''డయ్యాడు. 
కుమారుని త్యాగనిష్ఠకు సంతసించిన శంతనుడు, భీష్మునకు స్వచ్చంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు

అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముని అష్టమి రోజున వేడుకున్నాడు. భీష్ముడి జీవితం అంతా పరిపక్వం గానే గడిచింది.

ఇక మరణసమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు.

అంపశయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణపరమాత్ముడుని స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు.
అందుకే "విష్ణు సహస్ర నామ జయంతి" అని కూడా అంటారు.

భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ
‘తాతా! నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు’ అని ప్రశ్నించింది.

అందుకు భీష్ముడు ‘అవును తల్లీ! ఈ దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదు... అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాన’ని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు.

మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు. అందుకే దీనిని
" భీష్మ ఏకాదశిని , జయ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం.

ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే! ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషుడిగా మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈ ఏకాదశి నాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. 
ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి, బహుశా ఈ సూచని చేసి ఉంటారు.

ఈరోజు "విష్ణు సహస్రనామ పారాయణ" చేసిన

లేదా

"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే"

అనే శ్లోకాన్ని మూడు సార్లు పఠించిన కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం..

సర్వే జనా సుఖినోభవంతు </div>

                    
    

    

    <style>

	.arrow_box_left {

	position: relative;

	background: #FFFFFF;

	border: 4px solid #990000;

	margin-left:35px;

}

.arrow_box_left:after, .arrow_box_left:before {

	right: 100%;

	top: 50%;

	border: solid transparent;

	content:

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha