32 దేవతాపరాధములు
దేవర్షి నారదుడు చెప్పిన 32 దేవతాపరాధములు
మూల శ్లోకములకు అర్థము
1. గుడిలో పాదరక్షలుతో, వాహనములతో గాని తిరుగుట.
2. దేవతా ఉత్సవాలయందు పాల్గొని సేవింపకుండుట.
3. దేవతా ఉత్సవాలయందు ఏమరుపాటుతో నుండుట.
4. ఎంగిలితో, అశౌచముతో పూజలలో పాల్గొనుట.
5. ఒక చేతితో దండము పెట్టుట.
6. దేవుని వెనుక ప్రదక్షిణ చేయుట.
7. ఉపచారములందు శక్తికొలది చేయక హీనముగా చేయుట.
8. దేవునికి నివేదింపక తాను తినుట.
9. ఆయా కాలములయందు పండిన ఫలములను నివేదించక తినుట.
10. తినగా మిగిలిన పదార్థములు నివేదించుట.
11. దేవునికి వీపు చూపుచు కూర్చొనుట.
12. దేవుని యెదుట పరులకు నమస్కరించుట.
13. గురుని విషయమై మౌనముగా నుండుట.
14. దేవుని యెదుట తన గురించి గొప్పగా చెప్పుట.
15. దేవుని నిందించుట.
16. దేవుని యెదుట కాళ్ళు చాచుట.
17. దేవుని యెదుట ఠీవిగా కూర్చొనుట.
18. దేవుని యెదుట పరుండుట.
19. దేవుని యెదుట భక్షించుట.
20. దేవుని యెదుట మిధ్యాభాషణము చేయుట.
21. దేవుని యెదుట బిగ్గరగా మాట్లాడుట.
22. దేవుని యెదుట కబుర్లు చెప్పుకొనుట.
23. దేవుని యెదుట చెడు ఆలోచనలు చేయుట.
24. దేవుని యెదుట కొట్టుకొనుట.
25. దేవుని యెదుట నిగ్రహించుట.
26. దేవుని యెదుట అనుగ్రహించుట.
27. దేవుని యెదుట స్త్రీ పురుష క్రూర భాషణము.
28. దేవుని యెదుట కంబళాదులు కప్పుకొనుట.
29. దేవుని యెదుట పరులను నిందించుట.
30. దేవుని యెదుట పరులను కీర్తించుట.
31. దేవుని సన్నిధిలో అశ్లీల భాషణము చేయుట.
32. దేవుని వద్ద అపానము విడిచి పెట్టుట.