దైవీక అగ్నిహోత్రం
దైవీక అగ్నిహోత్రం
మనం యజ్ఞయాగాదులు ఎప్పుడో మర్చిపోయాము. వాయు కాలుష్యం ఉష్ణాన్ని పీలుస్తున్నాయి. ఫలితంగా నీరు ఆవిరిగా మారిపోతోంది. తత్ఫలితంగా వర్షాలు కూడా అరుదయ్యాయి. ఇవన్నియు వాయు కలుషిత సంబంధిత లక్షణాలే. ఈ వాయు కాలుష్యం అనే నెగిటివ్ ఎనర్జీని తగ్గించాలంటే తగిన పాజిటివ్ ఎనర్జీనిచ్చే యజ్ఞ యాగాదులు ఆచరించాలి. అప్పుడే మన ఓజోన్ కవచం పునఃసంపూర్తిగా కూడుకోగలదు. మనము కిరణాలు ఉత్పత్తి చేసే క్యాన్సర్ రోగంనుండి రక్షింపబడతాము. మీరే ఆలోచించండి. మనలో ఎంతమంది యజ్ఞం చేస్తున్నారో. వైదిక ధర్మాలను ఆచరిస్తున్నారో, లక్షమంది జనాభాకు ఒకరున్నారన్నా అతిశయోక్తే. కానీ కొన్ని పుణ్య కుటుంబాలు నాకు అక్కడక్కడా తగలడం ఈ కలియుగంలో ఆశ్చర్యం లేదు. కొన్ని ఆశ్రమాలు, పీఠాధిపతులు యజ్ఞాలు చేయించి మన సాంప్రదాయాన్ని నిలబెడుతున్నారనడంలో ఏ మాత్రము సంశయము లేదు. వారు యజ్ఞ, యాగాదులు చేయడానికి ప్రోత్సహిస్తుంటారు. దానిలో గల సైన్సు తెలిసినా తెలియక పోయినా సత్ఫలితాన్నిస్తుంది. మీ ఇంట్లో అగ్నిహోత్రం నేడే ప్రారంభించండి. ఈ వేదాలలో అగ్ని హోత్రాన్ని తప్పనిసరియైన విధిగా నిర్దేశించారు. శరణాగతిని అలవర్చుకోవడానికి, పెంపొందించుకోవడానికి అగ్నిమాత్రమే సరళము, సులభమైన ఉ పాసనము. అగ్నిహోత్రావరణం వలన మనసు ప్రేమ మయమవుతుంది.
ఈ అగ్నిహోత్రం వాతావరణాన్ని, ప్రాణమును పరిశుద్ధ పరుస్తుంది. ప్రాణము, మనస్సు వాతావరణములు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగియున్నాయి. అందువలన అగ్నిహోత్రం ఆచరిస్తే మనసు పవిత్రం కావటం అనుభవం అవుతుంది.
ఈ అగ్నిహోత్రం వలన మీ యింట్లో 'కళ్యాణకర చలనం' | (పాజిటివ్ సైకిల్) ఎల్లవేళలా ప్రభావితంగా ఉంటుంది. దీనివలన కుటుంబంలోని అందరికీ మనశ్శాంతి, సుఖము, తృప్తి కలుగుతాయి.
మీ పిల్లల మనసుపైనా, వారిని పెంచడంలోను అగ్నిహోత్రం ఉత్తమ ప్రభావం కలిగిస్తుంది.
పిల్లల అల్లరితనం తగ్గుతుంది. అవగాహన శక్తి పెరుగుతుంది. సంస్కారవంతులవుతారు
ఈ అగ్నిహోత్రం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. చికిత్సాపరమైన గుణాలు గల ఆవిర్లతో (రసాయన వాయువు) వాతావరణం నిండిపోతుంది. తద్వారా వాతావరణంలోని హానికరమైన “బ్యాక్టీరియా” అదుపులోనికి వస్తుంది. అంతటా ఆరోగ్యం నెలకొంటుంది.
వ్యవసాయానికి అగ్నిహోత్రం ఒక వరం.
అగ్నిహోత్రం లోఅనేక ఔషధీకరణ గుణాలు ఉన్నాయి..
ఏది ఏమైనా ఇది వేదవిధి. దీనివల్ల మన గృహంలో సుఖ శాంతులు నెలకొంటాయి. ప్రకృతి విపత్తుల నుండి రక్షింపబడతాము.
దీనికి పెద్ద ఖర్చుతో చేయవలసిన అవసరం లేదు. కొన్ని రావి సమిధలు
లేదా మేడి సమిధలు లేదా మామిడి సమిధలు చిన్న చిన్న ఆవు పిడకలు సమకూర్చుకొని ప్రతిరోజు ఒక చిన్న ఆవుపిడకపై కొద్దిగా కర్పూరం ఉంచి వెలిగించిన సమిధలతో జ్వలింపచేసి కొద్దిగా బియ్యం నేతితో తడిపి మధ్యవేలు ఉంగరం వేలు బొటన వేలు కలిపి ఈ మూడువేళ్ళతో బియ్యం పట్టుకుని (1) సూర్యాయ స్వాహా, (2) అగ్నయే స్వాహా (2) ప్రజాపతయే స్వాహా అని ఈ మూడు ఆహుతులు ఇచ్చి నమస్కరించి తరువాత ఇష్టదేవతా ధ్యానము చేసి అందులోని భస్మమును ధారణ చేయాలి. ఈ విధంగా అందరూ నామమును చేసి సత్పలితములు పొందుదురు గాక.