దైవం మనలోనే వున్నాడు
దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటంలో
మనం ప్రధానంగా ఎదుర్కొనేవి ఏంటంటే
1.దైవం మనలోనే మనతోనే ఉన్నట్లు
సత్యం తెలియకపోవడం.
2.దైవానుభవం అంటే మన హృదయంలో జరిగేదేనన్న విశ్వాసం కలుగకపోవటం.
3.దైవానుభవం జరిగేవరకు సహనం వహించే
ఓపిక లేకపోవటం !
దైవం అంటే సత్యం.
సత్యం అంటే ఉన్నదని అర్ధం.
దైవం అనే సంపద మనలోనే ఉంది.
ఈ విషయంలో మనందరం ఆస్థిపరులమే.
కానీ అనుభవపరులమే ఇంకా కొందరు కాలేదు.
దైవం విషయంలో జ్ఞానం కలుగకపోయినా,
ఆ దైవం మనలోనే ఉన్నదనే సత్యంపై
విశ్వాసం రావాలి.
మనలోనే ఉన్న ఆస్థి ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు మనకు తెలియకుండా పోదన్న ధీమా ఉండాలి.
అలాంటి స్వాంతన వచ్చినప్పుడు దైవం అనుభవంలోకి రాలేదన్న వెలితి పోతుంది.
దైవాన్ని త్వరగా తెలుసుకోవాలన్న ఆదుర్దా తగ్గుతుంది. అప్పుడు ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనే సాధన ప్రశాంతంగా సాగుతుంది.
ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలం
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి