Online Puja Services

అతి ఉచిత దానాలు సోమరితనానికి తార్కాణం

18.116.90.161

*అతి ఉచిత దానాలు సోమరితనానికి తార్కాణం*
-------------------------------------------------------
పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు

తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇదే ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. 

అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.

ఆ రాజ్యాన్ని మహాబల చక్రవర్తి పాలిస్తూ వచ్చారు అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది

ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని చెప్పడంతో ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి వెళ్ళిపోయింది

ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ_ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు
ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు

కృష్ణుడు మహాబలరాజు తో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు
రాజా! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు

కృష్ణా మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నదీ_
అందరి దగ్గర సంపద బాగా ఉన్నదీ
నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందువల్ల దానధర్మాలకు ఇక్కడ స్థలం లేదు
ఇక్కడ ఎవరికీ ధానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు
ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు
అందుకే అందరూ ధానాలు అడుగుతూ వస్తున్నారేమో
ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటె నేను సిగ్గుపడుతున్నాను అన్నారు

తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తలదించుకున్నాడు ధర్మరాజు


సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం
ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు
మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో ప్రజలు ఎప్పుడు మారుతారో

చిన్న విన్నపము విధిగా సాధ్యమైన ఎక్కువ మందకి_

ఈ సందేశం పంపండి ఎందుకంటే కనీసం కొంతమంది నైన మార్చా లని ఆశిస్తూ!

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore