Online Puja Services

పాకిస్థాన్‌లో ద్వాపర యుగం నాటి హిందూ దేవాలయాలు!!

3.133.108.47

పాకిస్థాన్‌లో త్రేతాయుగం, ద్వాపర యుగం నాటి హిందూ దేవాలయాలు!!
-సేకరణ: లక్ష్మి రమణ 

సనాతన ధర్మంలో భారత దేశం వేదభూమి. ఇప్పుడున్న భారతదేశం కన్నా అప్పటి ఆ వేదభూమి చాలా విస్తారమైనది . అప్పటి  అఖండ భారత దేశంలో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ , భారతదేశం, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లు భాగంగా ఉండేవి. ఇది బ్రిటీష్ పరిపాలకి ముందరి మాట ! ఆ తర్వాత పరాయి తెల్లదొరలు ఈ సువిశాల దేశాన్ని పాలించి, విభజించి వెళ్లిపోయారు. అయితే విడిపోయిన పాకిస్తాన్ ముస్లిం దేశంగా గుర్తించబడింది. కానీ అక్కడ కూడా అనేక ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాలు ఉన్నాయి. 

కరాచీలో ఉన్న పంచముఖి హనుమాన్ ఆలయం:
పాకిస్తాన్ లోని ముఖ్యపట్టణం కరాచీలో ఉన్న పంచముఖి హనుమాన్ ఆలయం అత్యంత పురాతన దేవాలయం. ఇక్కడ కొలువైన హనుమాన్ విగ్రహం త్రేతాయుగం నుండి అంటే దాదాపు 17 లక్షల సంవత్సరాలుగా పంచముఖి హనుమంతుడిగా పూజలను అందుకుంటుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఆలయాన్ని 1882 సంవత్సరంలో పునర్మించారు.

బందర్ రోడ్డులో ఉన్న స్వామినారాయణ దేవాలయం:
కరాచీ నగరంలోనే బందర్ రోడ్డులో ఉన్న స్వామినారాయణ దేవాలయం సుమారు 160 సంవత్సరాల నాటిది. ఇక్కడ హిందూ, ముస్లిం లు కూడా పూజలను నిర్వహిస్తారు. అంతేకాదు భారతదేశం-పాకిస్తాన్ విభజన సమయంలో, ఈ దేవాలయాన్ని శరణార్థి శిబిరంగా ఉపయోగించారని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక గురుద్వారా కూడా ఉంది.

ఇస్లాంకోట్ లో రామాలయం :
పాకిస్తాన్ లోని ఇస్లాంకోట్ లో రాముడి ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఇస్లాంకోట్‌లో హిందువులు ఎంతో పవిత్రంగా ఇక్కడ రాముడిని పూజిస్తారు.

ముల్తానాలో సూర్యదేవాలయం: 
త్రేతాయుగంలో శ్రీరాముడి సైన్యంలో ఉన్న జాంబవంతుడి కుమార్తె జాంబవతిని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు  వివాహం చేసుకున్నాడు. జాంబవతి, శ్రీ కృష్ణ దంపతులకు పుట్టిన కుమారుడు సాంబుడు. తండ్రి ఇచ్చిన శాపం నుంచి విముక్తి కోసం సాంబ ముల్తానాలో సూర్యదేవాలయం నిర్మించాడు. ఈ ఆలయం ముస్లింపాలనలో ధ్వంసమై.. ఇప్పుడు శిధిలాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. .

బలూచిస్థాన్‌లోని శక్తిపీఠం హింగ్లాజ్ ఆలయం:
సతి పార్వతి 51 శక్తిపీఠాల్లో ఒకటి హింగ్లాజ్ ఆలయం. ఈ ఆలయం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు 120 కి.మీ దూరంలో హింగోల్ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం గురించి దుర్గా చాలీసాలో కూడా ప్రస్తావించబడింది. సతి భాగాలు ఎక్కడ పడితే అక్కడ శక్తిపీఠంగా ఏర్పడిందని పురాణాల కథనం. ఈ క్షేత్రంలో సతిదేవి తలపడిందని చెబుతారు. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి భారతదేశంతో సహా అనేక దేశాల నుండి భక్తులు వెళ్తారు.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi