Online Puja Services

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది

3.15.186.78

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది ?

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడు.. నేనే శని ప్రభావమునకు లోనయ్యాను.. మరి సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించిన ఈశ్వరుడు , శనితో " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. 

ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరుని అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం నాడు వచ్చే త్రయోదశి రోజు .

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6. ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం.
7. ఎవరి వద్దనుండి అయినాఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి. 

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం 

1 మయూరి నీలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట.
3 శని కి తిలభిషేకం చేయించుట.
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రాహ్మణునుకి దానం చేయుట.
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట.
6 ప్రతి రోజు నువ్వుండలుకాకులకు పెట్టుట.
7 శని వారం రోజు రొట్టి పై నువ్వుల నూనే వేసి కుక్కలకు పెట్టుట.
8 హనుమంతుని పూజ చేయుట..
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువుట..
10 కాలవలో కానీ, నది లో కానీ..బొగ్గులు, నల్ల నువ్వులు,మేకు కలపటం వలన..
11 శని ఏకాదశ నామాలు చదువుట వలన.. ( శనేశ్వర ,కోణ, పింగళ , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) అని ప్రతి రోజు చదవటం వలన..
12 బియ్యపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన..
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన..
14 ప్రతి శని వారం రావి చెట్టుకు ప్రదషణం మరియు నల్ల నువ్వులు,మినుములు కలిపిన నీటిని రావి చెట్టు కు పోయటం వలన..
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన..
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన..
17 బ్రాహ్మణునికి నల్ల వంకాయలు, నల్ల నువ్వులు, మేకు , నల్లని దుప్పటి దానం చేయుట వలన..
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహాలయం ముందు బిచ్చ గాళ్ళకు ఆహరం పెట్టుట వలన, నల్లని దుప్పటి దానం చేయటం వలన..
19 అయ్యప్ప మాల ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన, శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధరించుట వలన, 20 శని వారములు వెంకటేశ్వర స్వామి దర్శనం, శివాలయం లో శివుని దర్శనం ,హనుమంతుని దర్శనం, కాల భైరవ స్వామి దర్శనం, మరియు పూజ వలన శని గ్రహ దోషం పోవును.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi