Online Puja Services

దీపం తో చేసే కొన్ని జప మంత్రాలు

18.191.195.105

దీపం తో చేసే కొన్ని జప మంత్రాలు

1.ఓం హ్రీం శ్రీం హ్రీం శుభ లక్షై నమః 
శుభలక్ష్మీ నమస్తుభ్యం శుభప్రద గృహేశ్వరీ! 
శుభం దేహి ధనం దేహి శోభనం దేహి మే సదా||

గృహంలో శుభకార్యాలు జరగాలి అని కోరుకొని ఈ నామాన్ని 10 నిం అయిన దేవుని ముందు దీపం వెలిగించి జపించాలి , శుభకార్యాలకు ఉన్న ఆటంకాలు తొలగి మంచి జరుగుతుంది.

*************************

2. ఓం హ్రీం శ్రీం హ్రీం భూ లక్ష్మై నమః 
భూమిలక్ష్మీ నమస్తేస్తు సర్వ సస్య ప్రదాయినీ| 
మహీం దేహిం శ్రియం దేహి మహా మహిమా శాలినీ||

భూమి కొనాలి అనుకునే వారు, భూ సంబంధిత సమస్యలు, పంట వేసే ముందు కోతకు ముందు, దీపం ముందు కూర్చుని ఒక 20 నిం ఈ మంత్రాన్ని జపించాలి ..

*******************

3.ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్య లక్ష్యై నమః 
బిల్వలక్ష్మీ నమస్తుభ్యం అచ్యుత ప్రాణనాయకే | 
సౌఖ్యం దేహి ధృవం దేహి ఆరోగ్యం దేహి మే సదా||

దీపం పెట్టి ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు జపం చేయాలి...అనారోగ్యంతో ఉన్నవారు కానీ లేదా వారి కొసం ఇంట్లో ఎవర్సినైనా జపించ వచ్చు

******************

4.ఓం హ్రీం శ్రీం హ్రీం స్వర్ణ లక్షై నమః 
స్వర్ణ లక్ష్మీ నమస్తుభ్యం హేమాలంకార శోభితే 
స్వర్ణం దేహి ధనం దేహి స్వతంత్రం దేహిమే సదా ॥

బంగారు కొనాలి అనుకున్నా, లేదా ఉన్న బంగారు ఏదైనా తాకట్టులో ఉన్నా ఈ మంత్రాన్ని జపం చేస్తే ఆ సమస్య తీరి బంగారు చేరుతుంది...

*********************

5.ఓం హ్రీం శ్రీం హ్రీం విద్యా లక్షై నమః 
విద్యాలక్ష్మీ నమస్తేస్తు సర్వ విద్యా ప్రదాయినీ| 
విద్యాం దేహి జయం దేహి సర్వత్ర విజయం సదా||

విద్యార్థులు బాగా చదవాలి అభివృద్ధి కి రావాలి అని మంచి భవిష్యత్తు కోసం కోరుకొని ఈ మంత్రాన్ని దీపం పెట్టి వీలైనంత ఎక్కువ సార్లు జపించాలి.

**************************

6.ఓం హ్రీం శ్రీం హ్రీం సీతా లక్షై నమః 
సీతాలక్ష్మీ నమస్తుభ్యం రామానంద ప్రదాయినీ 
పతిం దేహి ప్రియం దేహి భర్తారం దేహిమే సదా||

మంచి లక్షణాలు కలిగిన భాగస్వామి గురించి , మంచి కుటుంబంతో సంబంధం. కుదరాలి అని కోరుకొని ఈ మంత్రాన్ని దీపం పెట్టి 108 సార్లు రోజు జపం చేయాలి..

***************************

7.ఓం హ్రీం శ్రీం హ్రీం ఐశ్వర్యలక్ష్మియై నమః 
ఐశ్వర్య లక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళ కారిణీ 
రూపం దేహి రసం దేహి సౌభాగ్యారోగ్య సంపదాం

ఐశ్వర్యo కోసం వృద్ధి కోసం.... క్షేమం కోసం గొప్పగా ఎడగటం కోసం ఈ మంత్రాన్ని 108 సార్లు తగ్గకుండా దీపం ముందు కూర్చుని జపం చేయాలి..

***************************

8. ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధి లక్ష్మియై నమః 
బుద్దిలక్ష్మీ నమస్తుభ్యం బుద్ధి చాతుర్య వర్ధినీ | 
వృద్ధిం దేహి శుభం దేహి బుద్ధి సిద్ధి ప్రదాయినీ!

దీపం పెట్టి వీలైనంత ఎక్కువగా ఈ మంత్రాన్ని జపిస్తే జ్ఞానం పెరగడం కోసం బుద్ది కుసలతతో పని చేయడం కోసం, ఈ మంత్రం ఎందులో పెట్టిబడి పెట్టాలి లేదా ఎలా చదివి అభివృద్ధికి రావాలి అనే జ్ఞానం లభిస్తుంది వివేకం పెరుగుతుంది..

******************************

9.ఓం హ్రీం శ్రీం హ్రీం సంతాన లక్ష్మియై నమః 
సంతాన లక్ష్మీ నమస్తుభ్యం సర్వ సౌభాగ్య దాయినీ! 
పుత్రాన్ దేహి ధనం దేహి పౌత్రాన్ దేహి సుధేశ్వరీ||

దీపం పెట్టి , సంతానం కోసం ఈ శ్లోకాన్ని జపిస్తూ కుంకుమ పూజ చేసిన జపం చేసిన త్వరగా సిద్ధిస్తుంది.
 

సేకరణ 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi