శ్రీ లలితా సహస్ర నామ భాష్యం
శ్రీ లలితా సహస్ర నామ భాష్యం
*71.జ్వాలామాలినికాక్షిప్తవ
జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము(=గుడి మొదలగువాని చుట్టుగోడ) యొక్క మధ్యనున్న తల్లికి నమస్కారము
(తిథులలో శుద్ధ చతుర్దశి, కృష్ణ విదియకు సంబంధించిన నిత్య దేవత పేరు జ్వాలా మాలిని.)
*Jwalimalika ksiptha vanhi prakara madhyaka*
She who is in the middle of the a fortified place of fire built by the Goddess Jwalamalini. Salutations to the mother.
జ్వాలామాలిని అనుదేవత చేత వెలిగించబడిన వహ్ని ప్రాకారము మధ్యన ఆ
పరమేశ్వరి. వెలుగొందుచున్నది అసలు ఈ జ్వాలామాలిని ఎవరు ? తిథులు
నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. కాబట్టి తిథులు, నిత్యలు, కళలు అన్నీ
ఒకటిగానే పరిగణించవచ్చు. చంద్రుని కళలు 16. ఇవి 15 తిథుల రూపంలో ఉండగా
16వ కళ మహాత్రిపురసుందరి సాక్షాత్తూ సచ్చిదానందస్వరూపమై ఉన్నది.
దర్భాద్యాః పూర్ణిమాంత స్తు కళా పంచదశైవ తు ।
షోడశీ తు కలా జ్ఞేయా సచ్చిదానందరూపిణీ ॥
ధర్మ అంటే పాడ్యమి వరకు తిథులు (కళలు) 15 కాగా 16వ కళ సాక్షాత్తూ
సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది.
నిత్యాదేవతలు మొత్తం 16మంది వీరిని వామకేశ్వర తంత్రంలోని ఖడ్గమాలలో వివరించటం జరిగింది. ఈ నిత్యాదేవతే చంద్రుని కళలు. అయితే తిథులు మాత్రం 15 ఉన్నాయి. అందుకే పదహారవకళ సాక్షాత్తూ పరమేశ్వరి అయి ఉన్నది అని చెప్పటం
జరిగింది. తిథులలో 14వది చతుర్దశి. ఆరోజున ఉండే నిత్యాదేవత జ్వాలామాలిని.
వాటి వివరాలు ఇలా ఉంటాయి.
శుక్లపక్ష తిథులు
పాడ్యమి
దశమి
ఏకాదశి
ద్వాదశి
త్రయోదశి
చతుర్షశి
పూర్ణిమ
నిత్యాదేవతల పేర్లు
కామేశ్వరి
భగమాలిని
నిత్యక్లిన్న
భేరుండ
వహ్నివాసిని
మహావజ్రేశ్వరి
శివదూతి
త్వరిత
కులసుందరి
నిత్య
నీలపతాక
విజయ
సర్వమంగళ
జ్వాలామాలిని
చిత్ర
16వ నిత్యమహానిత్య. ఈమె మహాత్రిపురసుందరి. ఇప్పుడు ఈ నిత్యాదేవతలలో
14వది. అంటే శుద్ధచతుర్దశినాడు ఉండే నిత్య. జ్వాలామాలిని ఈవిడ అగ్నిదేవుని కుమార్తె.
శుద్ధ చతుర్దశినాడు, బహుళవిదియనాడు కూడా ఈమె ఉంటుంది. ఈ విషయాన్ని 15 నామంలో వివరించటం జరిగింది.
భండాసురునితో యుద్ధం జరుగుతున్నది. పోరు భీకరంగా సాగుతోంది. అప్పుడు పరమేశ్వరి జ్వాలామాలినిని చూసి
వత్సే ! త్వం వహ్బ్నిరూపాసి జ్వాలామాలా మయాకృతిః
త్వయా విధీయతాం రక్షా బలస్యాస్య మహీయసీ
శతయోజనవిస్తారం పరివృతమహీతలం
త్రి శద్యోజన మున్నమ జ్వాలా ప్రాకార తాం ప్రజ ॥
బిడ్డా ! నీవు అగ్నిదేవుని కుమార్తెవు. కాబట్టి ఈ మహాసైన్యాన్ని రక్షించటానికి వందయోజనాల వైశాల్యము, ముఫ్రైయోజనాల ఎత్తు కల అగ్నిజ్వాలను సృష్టించవలసినది. అని పరమేశ్వరి ఆజ్ఞాపించగా, జ్వాలామాలిని అలాగే చేసింది. ఈ రకంగా
జ్వాలామాలినిచేత సృష్టించబడిన అగ్నివలయంలో మధ్యభాగాన ఆ పరమేశ్వరి ఉన్నది.
త చ్చక్తిపంచకం సృష్ట్యా లయేనాగ్ని చతుష్టయం
పంచశక్తి చతుర్వహ్ని సంయోగా చ్చక్రసంభవః ॥
శక్తి సంజ్ఞగల ఐదుచక్రాలు, అగ్ని సంజ్ఞగల నాలుగుచక్రాలు కలిపి శ్రీచక్రము
అవుతుంది. వీటి కలయికవల్లనే త్రికోణం ఏర్పడింది. అదే వహ్నిప్రాకారము. త్రికోణం మధ్యనే బిందు ఉంటుంది. త్రికోణే బైందవమ్‌శ్లిష్టమ్ వహ్ని ప్రాకారానికి లోపల ఉన్నది అంతరావరణ అని, మిగిలినవి బహిరావరణ అని అంటారు. బహిరావరణములో
అష్టకోణము, దశారయుగ్మము, మన్వస్రము, అష్టదళము, షోడశదళము, భూపురము
ఉంటాయి. అయితే బహిరావరణలోనిసేన భండాసురుని సేనను నాశనం చెయ్యటానికి, అంతరావరణలోని సేన భండాసురుణ్ణి సంహరించటానికి ఏర్పాటుచెయ్యబడ్డాయి.
జ్ఞాని అయినవాడు ఈ ప్రపంచంలోనే నివసిస్తున్నప్పటికీ, అజ్ఞానానికి దూరంగా,జ్ఞానజ్వాలలకు మధ్యన ప్రకాశిస్తూ ఉంటాడు. అగ్ని నుండి విస్ఫులింగాలు వేరుగా
ప్రసరిస్తాయి. వాటికి దూరంగా తనకుతానుగానే ప్రకాశించే అగ్నిలాగా జ్ఞానికూడా ప్రపంచంలో జీవిస్తూ కూడా ప్రపంచ వ్యవహారాలను పట్టించుకోకుండా తామరాకుమీది నీటిబొట్టులాగా ఉంటాడు.
మంత్రశాస్త్రంలో జ్వాలామాలినికి ప్రత్యేక మంత్రమున్నది.
*note. బీజాక్షరంలతో కూడిన మంత్రం నేను నా పోస్టులలో వ్రాయడం లేదు కేవలం తెలియపరస్తున్నాను*
*72.భండసైన్యవధోద్యుక్తశక్త
భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని చంపడానికి సిద్ధమైన తన శక్తి సైన్యాల పరాక్రమాన్ని చూచి ఆనందించిన తల్లికి నమస్కారము
*Bhanda sainya vadodyuktha shakthi vikrama harshitha*
She who was pleased by the Shakthi soldiers who are ready in killing the army of Bhandasura. Salutations to the mother.
భండాసురునితో యుద్ధం ప్రారంభమైంది. ఆ రాక్షససేనను వధించటానికి పరమేశ్వరిసేన ముందుకు కదిలింది. ఆ రకంగా రాక్షససేనను సంహరించటానికి
ముందుకు కదిలిన దేవతా సైన్యాన్ని చూసి పరమేశ్వరి సంతసించింది. ఇక్కడ యుద్ధము
రెండు భాగాలుగా జరుగుతోంది. 1. భండాసురవధ. 2. అతడి సేనను వధించటము.
ఆ రాక్షసుని సేనను వధించటానికి 64కోట్ల దేవతాసైన్యం ముందుకు కదలింది.
భండాసురుడు అజ్ఞాని. జీవి వేరు, దేవుడు వేరు అని భావించేవాడు. అహంకార మమకారాలతో నిండి ఉన్నవాడు. ఈ శరీరమే నేను. అనగా నేను అంటే శరీరమేగాని ఆత్మకాదు అని భావించేవాడు. కంటికి కనిపించే ఈ జగత్తే శాశ్వతము. అని నమ్మేవాడు.
అన్నీ తన అధీనంలోనే ఉన్నాయి. అని పూర్తిగా విశ్వసించేవాడు. ఇతడి సేన చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా అరిషడ్వర్గాలను నాశనం చెయ్యాలి. ద్వైదీభావానికి కారణము మనస్సు. అందుకని ముందుగా మనసుకు ఉండే బాహ్యవృత్తులను నశింపచెయ్యాలి. దృష్టిని అంతర్ముఖము చెయ్యాలి. అప్పుడు అతడి అజ్ఞానము పటాపంచలయిపోయి స్వస్వరూపజ్ఞానము కలుగుతుంది. అంటే ఆత్మసాక్షాత్కారమవుతుంది.
అప్పుడు జ్ఞాని ముక్తుడవుతాడు. ఈ పని చెయ్యటం కోసమని అద్వైతశక్తులు ముందుకు
కదలినాయి. అలాకదలిన ఆ శక్తులను చూసి పరమేశ్వరి సంతసించింది.