లలిత - తల్లి
'లలిత' అనే పదం లో ఒక 'ల' కారం ఒక 'లి' కారం, ఒక 'త' కారం వున్నాయి.
'తల్లి' అనే పదం లో కూడా ఒక 'త' కారం,ఒక 'లి'కారం,ఒక 'ల' కారం వున్నాయి .
యిదీ 'లలిత' అనే పదానికీ 'తల్లి' అనే పదానికీ మధ్య వుండే సంబధం.
సంస్కృతం లో 'తల్లి' అనే పదానికి 'యువతీ'అనే అర్థం వుంది.
సంస్కృతం లో 'మతల్లికా'అనే పదం వుంది.
ఈ పదానికి శ్రేష్ఠమైన అని తెలుప డానికి నామవాచకాల చివర ఉపయోగిస్తారు. .
ఉదాహరణకు 'గొమతల్లికా' అంటే శ్రేష్ఠ మైన ఆవు అని అర్థం.ఈ 'మతల్లికా' పదం లో గల మొదట, చివర వున్న 'మ' 'కా' అక్షరాలకు మధ్యగా ఆ పదానికి ప్రాసపదంగా వున్న రెండు అక్షరాల పదమే 'తల్లి'
ఈ 'తల్లి' అనే పదమే రూపాంతరం చెంది,దర్శించిన ఋషులకు 'లలిత' గా భాసించి ఉండవచ్చును.(కశ్యపః-పశ్యకః అయినట్లన్నమాట)
జన్మ నిచ్చే మాతృ స్వరూపిణిని తెలుపడానికి తెలుగు భాషలో 'తల్లి' అనే పదాన్నే తీసుకోవడం మన తెలుగువారి అదృష్టం.
అంటే జగజ్జనని నామం అయిన 'లలిత'ఏ మన తెలుగు భాషలో 'తల్లి'గా రూపాంతరం చెందింది. అని కూడా చెప్పుకోవచ్చును.
దీన్నిబట్టి తెలుగువారికి లలితాదేవి మరింత దగ్గరయిన తల్లి అనడం సమంజసమే గదా!
ప్రతి వ్యక్తీ ముందు తల్లిని గుర్తు పడతాడు.(మాతా పూర్వరూపం తైత్తిరీయము )తర్వాతనే తండ్రి
(పితోత్తర రూపం తైత్తిరీయోపనిషత్తు)ప్రతి వ్యక్తికీ తల్లి ప్రథమ గురువుగా,ప్రేమపూర్వక పోషణ కర్తగా
రక్షణ కర్తగా వ్యవహరించు వ్యక్తీ తల్లి అందుకే 'మాతృదేవో భవ'అని చెప్పబడింది.
యిక అందరి తల్లులకు మూల మైన విశ్వజనని యైన లలితాదేవి ప్రథమ ప్రధాన దైవం అవుతుందని వేరే చెప్పనక్కర లేదు.
-
అభినయ