భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలంటే తెలుగు అక్షరాలు నేర్పించాలి
హైందవి
భగవద్గీత ట్రయినింగ్ సెంటర్ - చివటం
పశ్చిమగోదావరి జిల్లా
భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలంటే
తెలుగు అక్షరాలు నేర్పించాలి
భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి అంటే..
ముందు తెలుగు అక్షరాలు స్పష్టంగా పలకడం రావాలి..
సంస్కృతం మరియు తెలుగులో
దాదాపు అక్షరాల ఉచ్చారణ ఒకే విధంగా ఉంటుంది..
భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది కాబట్టి పలకడం కష్టం...
శ్లోకాలు మనకు నోరు తిరగవు
అనే భ్రమలో నుండి బయటకు రండి..
సంస్కృతం మరియు తెలుగు రెండూ ఒకటే..
తెలుగులోని చాలా పదాలు సంస్కృతంలో నుండి తీసుకున్నవే..
ముందు తెలుగు అక్షరాలు స్పష్టంగా పలకడం అభ్యాసం చేయాలి..
అప్పుడు భగవద్గీత శ్లోకాలు కూడా తేలికగా, తప్పులు లేకుండా స్పష్టంగా చదవగలుగుతారు..
మన తెలుగు భాష గొప్పదనం
అక్షరమాల అల్లికలోనే ఉంది.
ఉపాధ్యాయులు పిల్లలతో
తెలుగు వర్ణమాలను వల్లె వేయించేవారు.
అలా కంఠస్ధం చేయించడంవల్ల
కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది...
ఏలాఅంటే
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
వీటిని అచ్చులు అంటారు..
క ఖ గ ఘ ఙ……..
కంఠం లోపలి భాగం నుండి పలకాలి
చ ఛ జ ఝ ఞ……..
నాలుక మధ్య భాగం.. నోరు పై భాగంలో తగలాలి
ట ఠ డ ఢ ణ……
నాలుక కొస... నోరు పై భాగంలో తగలాలి
త థ ద ధ న……
నాలుక కొస పళ్లకు తగలాలి
ప ఫ బ భ మ……..
పెదవులతో పలకాలి
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……
ఇవి పలికే సమయంలో నోరంతా కదులుతుంది
వీటిని హల్లులు అంటారు
వత్తులు పలికే సమయంలో కొంచెం గట్టిగా పలకాలి..
ఉదా.. ఖ, ఘా ఛ, ఝ, థ, ధ, ఫ, భ, క్ష..
సుందర, సుమధుర, సౌమ్యమైన
కమ్మని మృదుత్వంతో కూడిన
తియ్యని తేనేలాంటిది మన తెలుగు భాష.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట..
తెలుగు వారి ఇంటిముందు
ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుంది..
ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మీ పిల్లలతో తెలుగు అక్షరాలు గుండ్రంగా వ్రాయటం కూడా నేర్పించండి..
మనస్సులోని భావాన్ని
మాతృభాషలో వర్ణించినంత వివరంగా
ఇతర భాషలలో చెప్పడం కష్టం..
తెలుగులో స్పష్టంగా మాటలాడటం వస్తే
ఏ భాష అయినా తేలికగా మాట్లాడగలుగుతారు..
అందుకని మీ పిల్లలకు ముందు తెలుగు అక్షరాలు స్పష్టంగా పలకడం నేర్పించండి..
తరువాత భగవద్గీత శ్లోకాలు నేర్పించడం ప్రారంభం చేయండి..
మీరు ఏ అక్షరం ఎలా పలకాలో నేర్పించండి చాలు..
పిల్లలు వారంతట వారే
భగవద్గీత శ్లోకాలు చూసి చదవడం
ప్రారంభం చేస్తారు..
పిల్లలు భగవద్గీత శ్లోకాలు పారాయణం చేస్తుంటే..
చేస్తున్న వారికి ఆరోగ్యం..
వింటున్న మనకు ఆనందం..
ధన్యవాదములు.. మీ
హైందవి.. 9493 666 558