నూట ఎనిమిది సూర్యనామాలు
ధౌమ్యుడు యుధిష్ఠిరునికి చెప్పిన నూట ఎనిమిది సూర్యనామాలు:
సూర్యుడు,
అర్యముడు,
భగుడు,
త్వష్ట,
పూషుడు,
సవిత,
రవి,
గభస్తిమంతుడు,
అజుడు,
కాలుడు,
మృత్యువు,
ధాత,
ప్రభాకరుడు,
ఆపస్సు,
తేజస్సు,
ఖం,
వాయువు,
పరాయణుడు,
సోముడు,
బృహస్పతి,
శుక్రుడు,
బుధుడు,
అంగారకుడు,
ఇంద్రుడు,
వివస్వంతుడు,
దీప్తాంశుడు
, శుచి,
శౌరి,
శనిశ్చరుడు,
బ్రహ్మ,
విష్ణువు,
రుద్రుడు,
స్కందుడు,
వరుణుడు,
యముడు,
వైద్యుతుడు,
జఠరుడు,
ఐంధనుడు,
తేజసాంపతి,
ధర్మధ్వజుడు,
వేదకర్త,
వేదాంగుడు,
వేదవాహనుడు,
కృత,
త్రేత,
ద్వాపరం,
సర్వమలాశ్రయమై
కలి,
కలా కాష్ఠా ముహూర్త స్వరూపమైన కాలం.
క్షప,
యామం,
క్షణం,
సంవత్సరకరుడు,
అశ్వత్థుడు,
కాలచక్ర ప్రవర్తకుడైన విభావసుడు,
శాశ్వతుడయిన పురుషుడు,
యోగి,
వ్యక్తావ్యక్తుడు,
సనాతనుడు,
కాలాధ్యక్షుడు,
ప్రజాధ్యక్షుడు,
విశ్వకర్మ,
తమోనుదుడు,
వరుణుడు,
సాగరుడు,
అంశుడు,
జీమూతుడు,
జీవనుడు,
అరిహుడు,
భూతాశ్రయుడు,
భూతపతి,
సర్వలోకనమస్కృతుడు,
స్రష్ట,
సంవర్తకుడు,
వహ్ని,
సర్వాది,
అలోలుపుడు,
అనంతుడు,
కపిలుడు,
భానుడు,
కామదుడు,
సర్వతోముఖుడు,
జయుడు,
విశాలుడు,
వరదుడు,
సర్వధాతు నిషేచితుడు,
మనః సుపర్ణుడు,
భూతాది,
శీఘ్రగుడు,
ప్రాణధారకుడు,
ధన్వంతరి,
ధూమకేతుడు,
ఆదిదేవుడు,
అదితిసుతుడు (ఆదిత్య),
ద్వాదశాత్ముడు,
అరవిందాక్షుడు,
పిత,
మాత,
పితామహుడు,
స్వర్గద్వార ప్రజాద్వార రూపుడు,
మోక్షద్వార దూపమయిన త్రివిష్టపుడు,
దేహకర్త,
ప్రశాంతాత్మ,
విశ్వాత్మ,
విశ్వతోముఖుడు,
చరాచరాత్ముడు,
సూక్ష్మాత్ముడు,
మైత్రేయుడు,
కరుణాన్వితుడు.
ఈ నామాష్టశతం బ్రహ్మ చెప్పాడు. ఈ నామములనుచ్చరించిన తర్వాత, తన హితంకోసం ’దేవతా, పితృ, యక్ష, గణాలచే సేవింపబడే, అసుర, నిశాచర, సిద్ధులచే నమస్కరింపబడే, శ్రేష్ఠమయిన బంగారు, అగ్నికాంతులు గల్గిన సూర్యుని నమస్కరించుచున్నాను” అని నమస్కరించాలి.
సూర్యోదయసమయంలో సమాహితచిత్తుడై ఈ నామాలను పఠించినవాడు చక్కని భార్యాపుత్రులను, ధనరత్నరాశులను, పూర్వజన్మస్మృతిని, ధైర్యాన్ని , మంచిమేధను పొందుతాడు. దేవశ్రేష్ఠుడైన సూర్యభగవానుని ఈ స్తవాన్ని నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రచిత్తంతో చదివినవాడు శోకదవాగ్ని సాగరంనుండి విముక్తుడౌతాడు. మనోభీష్టాలయిన కోరికలను పొందుతాడు.