మొధేరా సూర్య దేవాలయం తెలుసా?
భారతదేశం, గుజరాత్ లోని మోధేరా వద్ద సూర్య దేవాలయం (1026 A.D.)
ఇది హిందూ సూర్య-దేవుడైన సూర్యకు అంకితం చేయబడింది.
దీనిని క్రీ.శ 1026 లో సోలంకి రాజవంశం రాజు భీమ్దేవ్ నిర్మించారు
ప్రస్తుత కాలంలో, ఈ ఆలయంలో ప్రార్థనలు జరుగుట లేదు. ఈ ఆలయం ఇప్పుడు భారత పురావస్తు సర్వే శాఖ పర్యవేక్షణలో ఉంది.
చరిత్ర
*********
స్కంద పురాణం మరియు బ్రహ్మ పురాణం ప్రకారం, మోధేరాకు సమీపంలో ఉన్న ప్రాంతాలను పురాతన రోజులలో ధర్మారణ్య అని పిలుస్తారు (అక్షరాలా ధర్మానికి ప్రతీక ఐన అడవి అని అర్ధం). ఈ పురాణాల ప్రకారం, రాముడు, రావణుడిని ఓడించిన తరువాత, వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి తనను బ్రహ్మహత్యా పాతకం నుంచి శుద్ధి చేయగల ఒక తీర్థయాత్రను చూపించమని కోరాడు (బ్రాహ్మ హత్యా పాపం అంటే బ్రాహ్మణుడిని చంపిన పాపం, ఎందుకంటే రావణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు ). ఆధునిక పట్టణం మోధేరాకు సమీపంలో ఉన్న ధర్మారణ్యను వశిష్ఠ మహాముని చూపించాడు. ధర్మారణ్యంలో, మోధేరాక్ అనే గ్రామంలో స్థిరపడి అక్కడ ఒక యజ్ఞం చేశాడు. ఆ తరువాత ఒక గ్రామాన్ని స్థాపించి దానికి సీతాపూర్ అని పేరు పెట్టారు. ఈ గ్రామం బెచరాజీ మోధేరాక్ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు తరువాత దీనిని కాలక్రమేణా మోధేరా అని పిలుస్తున్నారు. .
సూర్య దేవాలయాన్ని 1026 లో సోలంకి రాజవంశానికి చెందిన భీమ్దేవ్ 1 నిర్మించారు. సోమనాథ్ మరియు ప్రక్కనే ఉన్న చాలా ప్రాంతాలను మహమూద్ ఘజని దోచుకుని, అతని దాడి ప్రభావంతో ఆ ప్రాంతాలన్నీ నరకం చూస్తున్న సమయం అది. అయినప్పటికీ, సోలంకీలు తమ కోల్పోయిన శక్తిని మరియు శోభను తిరిగి పొందారు. సోలంకి రాజధాని అన్హిల్వాడ్ పటాన్ తిరిగి పునరుద్ధరించబడి కీర్తిని పొందింది. .
సోలంకిలను సూర్యవంశీ గుజార్ లేదా సూర్య భగవంతుని వారసులుగా భావించారు. ఈ ఆలయం ఎంతగా రూపకల్పన చేయబడిందంటే, సూర్యరశ్మి యొక్క మొదటి కిరణాలు సూర్య భగవానుడి విగ్రహం పై పడేలాగా ఈ శిల్పాలను రూపకల్పన చేశారు. .