లక్ష్మీ దేవి చంచలత్వానికి , కమలానికి సంబంధం ఏంటి ?
లక్ష్మీ దేవి చంచలత్వానికి , ఆమె కూర్చునే కమలానికి సంబంధం ఏంటి ?
లక్ష్మీ రమణ
లక్ష్మీ దేవికి చంచలత్వం ఎక్కువ . ఇవాళ ఉన్నవారి దగ్గర రేపుండదు . ఒక బిచ్చగాడు లక్షాధికారి కావొచ్చు . లక్షాధికారి బిచ్చగాడు కావొచ్చు . అందుకే ఆ అమ్మని విచిత్ర క్షౌమ ధారిన్యై అని కొలుస్తూ ఉంటారు . ఆమె అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు . ప్రతి ఇంట్లో లక్ష్మీ ఆరాధన కొనసాగుతూ ఉంటుంది .
లక్ష్మీ దేవి అష్టలక్ష్ముల రూపంలో ఉన్నప్పటికీ, ధనలక్ష్మినే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు . అమ్మవారు విరిసిన పద్మం పైన ఆస్సీనమై ఉంటారు . రెండు వైపులా గజరాజులతో విరాజిల్లుతూ, ధన వృష్టిని కురిపిస్తూ ఉంటారు . అమ్మవారిని పూజామందిరంలో పెట్టుకునేప్పుడు స్థోమతకు తగినట్టుగా కొందరు బంగారు, లేదా వెండి ప్రతిమని ఉంచి అర్చిస్తూ ఉంటారు.
అమ్మవారు ఇలా తామపూవులో కూర్చొని ఉండడమే చాలా ప్రత్యేకమైన విశేషం . దీని వెనుక ఒక రహస్యమే దాగుందంటున్నారు. అమ్మవారు తన స్వభావాన్ని ఇలా తామర పుష్పంలో కూర్చొని ఉండడంలోని సాంకేతిస్తారని పండితుల అభిప్రాయం . తామరపూవు బురదలోనే పుట్టినా కూడా, దాని పవిత్రతకి భంగం వాటిల్లదు . అమ్మవారు కమలాత్మిక కదా!
ఆమె కమలాత్మికా అయినందువల్లే ఆ తామరపాలని చూడగానే అలజడితో ఉన్న మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక. ఇలాగే మనం కూడా స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది. తామర పువ్వు కొలనులో లేదా సరస్సులో పుడుతుంది. సరస్సులో ఉన్నటువంటి ఈ తామర పువ్వుకు నిలకడ ఉండదు. నీటి ప్రవాహం వచ్చినప్పుడల్లా అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది.
అలాంటి తామర పువ్వు పై కూర్చుని మనకు దర్శనమిస్తున్న లక్ష్మీదేవి కూడా తను ఒక చోట స్థిరంగా ఉండనని, తాను నిలకడ లేని దానినని చెప్పడం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉంటారని పండితుల అభిప్రాయం . దీనికి నిదర్శకంగానే , మన ఇంట్లో కూడా డబ్బు ఎప్పుడూ నిలకడగా ఉండదని చెబుతుంటారు .
కానీ, మిగిలిన స్త్రీ దేవతా మూర్తులందరూ కమలంలోనే ఎందుకు కూర్చొని ఉంటారనేది ప్రత్యేకంగా తెలియజేస్తే బ్బగుంటుంది కాబట్టి మరో టపాలో వివరిస్తాం .