లక్ష్మి అంటే

హితోక్తి సూక్తులు - లక్ష్మి అంటే "ధనం" ఒక్కటేనా ?
అపోహ - లక్ష్మి అంటే డబ్బు మాత్రమే అని కొందరి అపోహ . కానీ అది సరికాదు
వాస్తవం :- మనలో చాలామంది లక్ష్మీదేవిని "డబ్బును ప్రసాదించే దేవతగానే పూజిస్తుంటారు. కాని ఈ 'లక్ష్మి' అంటే ధనం, ధాన్యం, ధైర్యం, ఫైర్యం, విజయం , ఆయుషు, ఆరోగ్యం, అభయం, సాహసం, వీర్యం, వేదవిద్య, యశస్సు, కీర్తి ప్రతిష్ఠలు, సంతానం, వాహనాలు, పరివారం మొదలగు నవి. లక్ష్మీస్తుతిలో లక్ష్మిని “ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః” అని స్తుతించడంలోని అర్ధం లక్ష్మి “దారిద్ర్యాన్ని నాశనంచేసేది” అని అర్ధం.