భగవంతుడు నన్ను నిరాకరించకుండా ఉండుగాక !

ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్రాణశ్చక్షుశ్శ్రోత్రమథో
సర్వం బ్రహ్మోపనిషదం మా2హం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాక
తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
నా అవయవాలైన వాక్కు, ప్రాణం, కళ్ళు, చెవులు మరియు తక్కిన ఇంద్రియాలన్నీ అత్యంత శక్తిమంతమై ఉండుగాక !
ఉపనిషత్తులు వచించే భగవంతుడే సర్వం.
ఆ భగవంతుని నేను నిరాకరించకుందును గాక.
భగవంతుడు నన్ను నిరాకరించకుండా ఉండుగాక !
భగవంతుని నుండి నిరాకరణ ఉండకుండు గాక !
నా నుండి నిరాకరణ ఉండకుండుగాక !
ఉపనిషత్తులలో వచింపబడిన ధర్మాలు ఆత్మను ఆకాంక్షించే నాలో నెలకొనుగాక !