చెవులతో మేం మంచి విషయాలను వినాలి

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః |
భద్రం పశ్యేమాక్షభిర్య జత్రాః |
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః |
వ్యశేమ దేవహితం యదాయుః |
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః |
స్వస్తి నః పూషా విశ్వవేదాః |
స్వస్తినస్తార్యో అరిష్టనేమిః |
స్వస్తి నో బృహస్పతిర్దధాతు |
ఓం శాంతిః శాంతిః శాంతిః
దేవతలారా! చెవులతో మేం మంచి విషయాలను వినాలి.
పూజనీయులారా! కన్నులతో మేం మంచి విషయాలను చూడాలి.
దృఢమైన అవయవాలతో కూడిన దేహాలతో ఆయుస్సు పర్యంతం మేం మిమ్మల్ని స్తుతించాలి.
మీకు మేలు ఒనగూర్చే రీతిలో మేం జీవించాలి.
ఎంతో కీర్తిగాంచిన ఇంద్రుడు మనకు మేలు చేయుగాక!
సర్వజ్ఞుడైన సూర్యుడు మనకు శుభం కలిగించుగాక!
చెడును నశింపచేసే గరుత్మంతుడు మనకు మేలు చేయుగాక!
బృహస్పతి మనకు శుభాన్ని ఒసగుగాక.!