Online Puja Services

వరదాయకుడు హరిద్రగణపతి

3.15.203.246

గురుగ్రహ అనుగ్రహాన్ని సిద్ధింపజేసే వరదాయకుడు హరిద్రగణపతి . 
-సేకరణ: లక్ష్మి రమణ 
  
పార్వతీదేవి మొదట వినాయకుణ్ణి చేసింది ఆమె పెట్టుకున్న నాలుగు పిండితోటే కదా ! అలా పిండితో చేసినట్టు హరిద్రంతో (పసుపుతో ) రూపొందిన రూపంలోని గణపతిని మనం ప్రతి శుభకార్యంలోనూ పూజిస్తూనే ఉంటాం . కానీ మంచి పసుపు కొమ్ముమీద గణపతి రూపాన్ని చెక్కి , దానిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు ఉంటాయని శ్రుతివచనం . 

శ్వేతార్కమూల గణపతి మాదిరిగానే హరిద్రగణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు. పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అంటారు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచిగానీ, ఎర్రని వస్త్రంపైన ఉంచి గానీ  పూజించాలి. ఏదైనా గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు.

జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షలలో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది. వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్రగణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచినట్లయితే, ఆటంకాలు తొలగి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హరిద్ర గణపతికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి మూల మంత్రాన్ని, గణేశ గాయత్రీ మంతాన్ని పదకొండు సార్లు చొప్పున పఠించాలి. పురోహితులకు శనగలు, పసుపు రంగు వస్త్రాలను ఇతోధిక దక్షిణతో కలిపి దానం చేయాలి. గురువులను తగిన కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi