Online Puja Services

విఘ్నేశ్వరుడు విద్యా గణపతి ఎలా అయ్యాడు?

3.18.103.55
ఓం నమఃశివాయ 
 
 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 
 
విఘ్నేశ్వరుడు.. విద్యాగణపతి 
 
చదువంటే గణపతికి ఇష్టం... 
 
నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం కూడా ఉంది. 
 
"వేదవ్యాసుడు" భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. 
 
‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతారా!’ అని అడిగాడట. 
"మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి.
 
 ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే... నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు.

"సరస్వతి" నది తీరాన మహాభారత రచన మొదలైంది.
 
వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. 
వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. 
 
చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా.. వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది... తన షరతు ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. 
 
తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలి పోయిందని శోకించాడట వ్యాసుడు. సరే.. తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే.. ఏముంది? 
 
ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. 
 
అంటే.. ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు. లేదా.. వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు. 
 
వ్యాసుడు "గణపతి"కి కృతజ్ఞతతో ...నీ పుట్టిన రోజున  పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. అందుకే విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని కూడా పిలుస్తారు.
 
ఓం నమో వ్రాతపతయే
నమో గణపతయే నమః       
ప్రమథ పతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే 
శివసుతయ వరద మూర్తయే నమః
 
 ఓం గం గణపతయే నమః 
 
- సత్య వాడపల్లి 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore