Online Puja Services

శ్రీ గణేశ పంచరత్నం తాత్పర్యం

3.12.161.151
శ్రీ గణేశ పంచరత్నం
 
1.ముదాకరాత్త మోదకం 
 సదా విముక్తి సాధకం!!
కళాధరావతంసకం  
విలాసిలోక రక్షకం!!   
అనాయకైక నాయకం   
వినాశితే భదైత్యకం!!
నతాశుభాశు నాశకం  
నమామి తం వినాయకం!!
 
తాత్పర్యం:
 
మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, 
శిరస్సున చంద్రుని ధరించిన, 
లోకాన్ని కాపాడే, 
నాయకులకే నాయకుడైన, 
అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే 
ఆ విఘ్నేశునికి నా నమస్కారములు. 
 
2.నతేతరాతి భీకరం 
నవోదితార్క భాస్వరం!!
నమస్సురారి నిర్జనం 
నతాధికా పదుద్ధరం!!
సురేశ్వరం నిధీశ్వరం 
గజేశ్వరం గణేశ్వరం!!
మహేశ్వరం సమాశ్రయే 
పరాత్పరం నిరంతరం!!
 
తాత్పర్యం:
 
భక్తుల శత్రువులకు భయం కలిగించేవానికి, 
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , 
భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, 
దేవతలకే దేవునికి,సర్వ సంపదలకు అధిపతి 
అయిన వానికి, గజరాజుకు, 
దేవతల గణాలకు అధిపతి అయిన వానికి 
ఎల్లప్పుడూ నా నమస్కారములు. 
 
3.సమస్త లోక శంకరం 
 నిరస్త దైత్య కుంజరం!!
దరేదరోదరం వరం 
వరే భవక్త్ర మక్షరం!!
కృపాకరం క్షమాకరం  
ముదాకరం!! యశస్కరం
మనస్కరం నమస్కృతాం!!  
నమస్కరోమి భాస్వరం!!
 
తాత్పర్యం:
 
సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, 
లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, 
పెద్ద ఉదరముతో, గజముఖముతో 
జనులను ఆశీర్వదించే వానికి, 
కరుణను కురిపించే వానికి, 
తప్పులను క్షమించి, శుభము,యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి 
సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి 
నా నమస్కారములు.
 
4.అకించనార్తి మార్జనం 
చిరంతనోక్తి భాజనం!!
పురారి పూర్వ నందనం 
సురారి గర్వ చర్వణం!!
ప్రపంచ నాశ భీషనం 
ధనంజయాది భూషణం!!
కపోల దాన వారణం 
భజే పురాణ వారణం!!
 
తాత్పర్యం:
 
కోరికలను తీర్చి, బాధలను నశింపజేసే వానికి, 
అనాదిగా పూజింపబడిన వానికి, 
ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, 
అసురుల గర్వాన్ని అణచే వానికి, 
ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, 
సర్పము ఆభరణంగా ఉన్నవానికి, 
మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా భజనలు. 
 
5.నితాంతికాంత దంత 
కాంతిమంత కాంతకాత్మజం!!
అచింత్య రూప మంతహీన
మంత రాయకృంతనం!!
హృదంతరే నిరంతరం 
వసంతమేవ యోగినం!!
తమేకదంతమేవతం 
విచింతయామి సంతతం!!
 
తాత్పర్యం:
 
ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి (ఏకదంతునికి), మృత్యుంజయ కారకుడైన శివుని కుమారునికి, 
వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవానికి, అంతము లేని వానికి, 
విఘ్నాలు, ఆపదలు తొలగించే వానికి, 
వసంత రుతువులాగా యోగుల మనస్సులో నిలిచే వానికి ఎల్లప్పుడూ నా స్మరణ.
 
ఆదిశంకరాచార్య విరచిత..గణేశ పంచరత్నం..సంపూర్ణం.
 
(సేకరణ)
శ్రీ రాధా లక్ష్మి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore