3వేల అడుగుల ఎత్తులో దోలకల్ గణేశుడు
• 3వేల అడుగుల ఎత్తులో దోల కల్ గణేశుడు •
ఎవరు ప్రతిష్ఠించారో ఇప్పటికీ తెలియదు • 2012లోనే బయల్పడ్డ విగ్రహం 11వ శతాబ్దం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం
దండకారణ్యంలో దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ ఓ పెద్ద కొండ. అక్కడికి వాహనాలు వెళ్లలేవు. సమీపంలోని గ్రామం నుంచి కొండల్లో కోనల్లో పడి నడిచి వెళ్లే కనీసం 7 గంటలు పడుతుంది. అంత దట్టమైన అడవిలో సముద్ర మటానికి 3 వేల అడుగుల ఎత్తులో కొండ అగ్రంపై వినాయకుడి విగ్రహం ఉన్నది. దోల్కల్ వినాయకుడిగా పిలిచే ఈ రాతి విగ్రహాన్ని ఎప్పుడు ఎవరు ఏర్పాటు చేశారో ఎవరికీ తెలియదు.
అసలు 2012 దాకా అక్కడ ఒక విగ్రహం ఉందన్న సంగతే తెలియదు. అనుకోకుండా ఓ సాని కుడు కొండ అగ్రభాగానికి ఎక్కడంతో అక్కడ విగ్రహం బయటప డింది. విగ్రహం మూడు అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పుతో ఉన్నది. చుట్టూ గుడి ప్రాకారం లాగా భారీ రాళ్లు ఉన్నాయి.
ఈ విగ్రహాన్ని 11వ శతాబ్దంలో నాగా వంశీయులు ఏర్పాటు చేసి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వినాయకుడి పొట్టపై నాగుపాము గుర్తు కూడా ఉన్నది. దంతెవా డలో 2012లో బయలడిన ఈ విగ్రహం 2017లో కనిపించ కుండా పోయింది.
తనిఖీ చేయగా కొండ కింది భాగంలో ముక్కలు కనిపించాయి. విగ్రహం 62 ముక్కలై ఉన్నది. వాటిని తిరిగి కొండ పైకి చేర్చి పునఃప్రతిష్ఠించారు. గతంలో దోల కల్లో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది.
ఇవన్నీ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగి స్తాయనే ఉద్దేశంతో మావోయిస్టులే ఈ విగ్రహాన్ని కొండమీద నుంచి తోసి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే తాము విగ్రహాన్ని ఏమీ చేయలేదని మావోయిస్టులు చెప్పారు.
- whatsapp sekarana