ప్రపంచం లోనే అతి పెద్దదైన గణపతి విగ్రహం
ప్రపంచం లోనే అతి పెద్దదైన గణపతి విగ్రహం మీకు తెలుసా???
ప్రపంచం లోనే అతి పెద్దదైన(పొడవైన)గణపతి విగ్రహం ఎక్కడ ఉంది?ఇండియా లో కాదు అది థాయ్ ల్యాండ్ లో ఉంది. ఇది 39 మీటర్ ల ఎత్తు తో గణేశుడి విగ్రహాలలో ఇదే అతి పెద్ద విగ్రహం.దీనిని థాయ్ యువరాణి సోమసవాలి ఫరావరరాజాతినుద్ధమత్ చే ప్రతిష్టించబడింది.ఒకసారి ఆలోచన చేయండి ఇదే పని ఇండియా లో చేసి ఉంటే మన సో కాల్డ్ మానవతా వాదులు, లిబరల్స్ డబ్బు వృధా అంటూ అరిచేవారు.అవి మరుగుదొడ్ల కోసం వాడండి అని ఉచిత సలహాలు ఇస్తారు. ఈ రోజు థాయ్ బుద్దిస్ట్ లు గణేష్ చతుర్థి ని హిందువుల మాదిరిగానే చేస్తున్నారు.వారికి గణపతి అంటే ఫికనెట్ గా పిలుస్తారు. ఇది చాలా ప్రఖ్యాతి గాంచింది థాయ్ ల్యాండ్ లో. హిందువుల మాదిరిగానే చేసినప్పటికీ ఈయనను విజయానికి చిహ్నం గా అన్ని కష్టాలనుండి దూరం చేసేవాడు అని నమ్ముతారు. కొత్త వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు లేదా ఒక శుభకార్యం,పెళ్లి చేసేటప్పుడు కూడా గణపతి ని పూజిస్తారు. వారి ఆచార వ్యవహారాల ప్రకారం గణపతి వారి జీవన విధానం లో ఒక భాగం గా కలిసిపోయారు. వీరికి అధికారిక లోగో కూడా గణపతి ఫోటో తో ఉంటుంది.