నీ లీలలు మనోహరం

సూర్య .......!
చంద్రాగ్నుల తేజంతో
సంచరించే ఓ వినాయకా ....!
నీ నడకయేకాదు నీ కర్మలు కూడా గొప్పవే !!
నీవు ఎటు పాదం మోపుతే జగత్తు అటు నడుస్తుంది ఎక్కడైనా ఒక లోకోత్తర
కార్యం జరిగితే ఆ మహాక్రమానికి
ప్రారంభం నీవే కదా !!
అంతర్గత భీషణ సౌందర్యాన్ని
ప్రతి హృదయంలో సంచరింపచేసే
మహా తేజుడయిన బిజయగణపతివై
మాపై కాంతులు వర్షించు గణనాయకా !
లోక కళ్యాణ కార్యాలకోసమే అవతరించిన
నీ శుభాంగుని శోభలు సంరక్షించుగాక. !!
నిన్ను చూడడానికి
కోమలుడుగానే కనిపిస్తావు
లంబోదరుడుగానే సాక్షాత్కారిస్తావు
ఓ . మహాగణపతి నీ లీలలు మనోహరంగా
సువ్యవస్థితంగా కనిపిస్తున్నాయి
మమ్మల్ని ఉద్ధరించడానికి
విఘ్ననాయకునిలా
ఎంతో వ్యాకుల పడతావు
గొప్ప తపస్సుకు ఫలితంగా మాత్రమే
మీ శ్రేష్ఠతను మేము సాధించుకోగలం
ఈ పదునాలుగు లోకాల సామర్థ్యం
స్థిరత్వం దృఢత్వం నీవే కదా ఓ గణపతీ
. సింధూరవర్ణం ద్విభుజం గణేశం.
లంభోదరం పద్మదలే నివష్టమ్
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిధ్యాయుతం
తం ప్రణమామి దేవమ్ !!
ఓం గం గణాధిపతయే నమః