Online Puja Services

పంచమహాశక్తులలో నాల్గవ రూపము సరస్వతీదేవి !

18.218.54.178

పంచమహాశక్తులలో నాల్గవ రూపము సరస్వతీదేవి !
కామకోటి వారి సౌజన్యంతో 

సరస్వతీ దేవి జ్ఞానస్వరూపము. ఆ దేవిని చదువులకోసం ఆరాధించని వారెవరు ? చదువు అంటే కేవలం ఇప్పటి పుస్తకాలలో ఉండే విజ్ఞానం మాత్రమే కాదు . అంతకు మించిన ఆధ్యాత్మిక తత్వ స్వరూపమే ఈ దేవి. వేదము అనే మాటకి అర్థము జ్ఞానము. జ్ఞానము ఒక దేవీ స్వరూపాన్ని పొందితే ఆ రూపమే అమ్మవారి పంచమహాశక్తులలో నాలుగవ మహాశక్తి సరస్వతీ మాత . మాఘ శక్ల పంచమినాడు సరస్వతీదేవిని పూజించిన వారికి సకల విద్యలూ స్వాధీనమవుతాయని నారదునికి శ్రీ మహావిష్ణువు చెప్పిన వృత్తాంతాన్ని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు. ఆ వృత్తాంతాన్ని మనమూ అవధరిద్దాం రండీమరీ !

పూర్వము యజ్ఞవల్క్యుడు అనే మహర్షి గురువు ఇచ్చిన శాపంవల్ల విద్యావిహీనుడయ్యాడు. తానూ నేర్పినవిద్యనంతా కక్కేయమన్నాడు ఆ గురువు . అలాగే గురువుగారి దగ్గర తానూ నేర్చుకున్న విజ్ఞానాన్ని రక్తపు వమనం గా బయటకి కక్కేశారు యజ్ఞ్యవల్క్యుడు.  ఆ వాంతిని గ్రహించి, అతని జ్ఞానాన్ని తమలోకి తీసుకున్న తిత్తిరిపక్షులు ఒక ఉపనిషత్తునే చెప్పాయి . అదే తత్తరీయోపనిషత్తు ! అదీ ఆయన జ్ఞానం . 

ఆ తర్వాత ఆ మహర్షి  సూర్యుణ్ణి ఆరాధించి, సూర్యుని అనుగ్రహంతో సరస్వతీ స్తోత్రం చేసి అపారమైన ప్రతిభా పాండిత్యాలను సంపాదించాడు. అలా యజ్ఞ్యవల్క్యుడు చేసిన సరస్వతీస్తోత్రం ముప్ఫయి రెండు శ్లోకాల్లో దేవీ భాగవతంలో మనకి కనిపిస్తుంది . ఈ స్తోత్రాన్ని చదివినా, విన్నా, స్మరించినా అపారమైన విద్యావైభవం కలుగుతుందని ఫలశ్రుతిని అనుగ్రహించాడు వ్యాసమహర్షి. 

కవచము అంటే శరీరాన్ని రక్షిచేది. యుద్దానికి వెళ్ళే యోధుడు శత్రువులు ప్రయోగించే బాణాలు తనకు తగులకుండా ఉండడానికి కవచం ధరిస్తాడు. అలాగే దేవతోపాసనకు పూనుకున్న సాధకుడు ఆ దేవతా సంబంధమైన కవచాన్ని మంత్ర బీజాక్షర రూపంగా పఠంచాలి. వెలుపల ఉన్న భూత ప్రేత పిశాచాదులవల్ల సాధకుని ఆరాధనకు అంతరాయం కలగకుండా కవచం రక్షిస్తుంది.

కణ్వశాఖలో చెప్పబడిన విధంగా సరస్వతిని ఆరాధించడానికి ముందుగా విఘ్ననివారణకై గణపతిని పూజించి, షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి.

"శ్రీం శ్రీం సరస్వత్త్యె స్వాహా శిరో మే పాతు సర్వతః |
శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదా అవతు||"

అని సరస్వతీ కవచాన్ని పఠించాలి. సరస్వతీ కవచానికి ఋషి ప్రజాపతి. బృహతీ ఛందస్సు, దేవత శారద. ఫలము సర్వతత్త్వ విజ్ఞాన వేతృత్వమే. 

 వర్ణ, శబ్ద, పద, వాక్య రూపాలలో, కవితారూపంలో, గానరూపంలో, ఆలోచనారూపంలో, కల్పనారూపంలో తనను ఆరాధించిన వారికి బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రసాదించి, వారిని సరస్వతీ పుత్రులుగా ప్రఖ్యాతిని పొందునట్లు అనుగ్రహించే విద్యాప్రదాత్రి సరస్వతీ మాత. రాజసీ శక్తి స్వరూపిణిగా ఉన్న సరస్వతి బ్రహ్మదేవునికి సహచారిణి అయి, సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తింప చేస్తుంది.

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore