Online Puja Services

మహామంత్ర చింతామణి

3.147.242.185

 

సాక్షాతూ శివుడు ఉపదేశం ఇచ్చిన అతిశక్తివంతమైన మహామంత్ర చింతామణి............!!

కోర్కెలు తీర్చు, కష్టాలు పోగొట్టి,ధన వృద్ధి , సకల కామ్యాలు తీర్చే సకల సంపదలు ఇచ్చే  మహాచింతామణి.

ఈ మహామంత్ర చింతామణి మంత్రము శివుడు నారద మహర్షి కి ఉపదేశం చేసాడు , దేశ కాలనియమములు పాటించవలసిన పనిలేదు.


శ్రీకృష్ణుని యందు భక్తి కలిగి ఉన్న యెడల ఈ
మంత్రమును జపించుటకు అధికారులే . 

 


శ్రీకృష్ణుని యందు భక్తి లేని యెడల,  యజ్ఞములు చేసినవారు కాని, దానములు చేసినవారు కాని
సత్యవాదులు కాని, వేదావేదాంగ విదులుకాని, తపోవ్రత పరాయణులు కాని బ్రహ్మనిష్ట చేసే వారు కూడా కానీ ఈ మం(తమును జపించకూడదు.

 


కృష్ట్ణునియందు భక్తి కలిగివున్న యెడల ఎవరూ అయిన ఈ మంత్రమును జపించవచ్చును. అట్టి శ్రీకృష్ణ భక్తులకు ఈ మంత్రమును నుపదేశింపవలెను. ఈమంత్రమును జపించువారు రాధసహిత శ్రీకృష్ణ ని పూజించవలెను. ఈ మంత్రం ఒకసారి పఠించినంత మాత్రముననే ఫలితము యిచ్చును. 


అయిననూ ప్రతినిత్యమూ 108 సార్లు జపించు యెడల 
విశేష ఫలదాయకమగును. ఈ మంత్ర సాధకులకు శ్రీ రాధాకృష్ణ దయవల్ల అన్ని కష్టములు తొలగిపోయి, సకల భోగభాగ్యములు కలిగి అంత్యమున పరమపదము లభించునని మహాదేవుడు
నారద మహర్షికి ఉపదేశించెను.

 

మూల మంత్రం 

గోపీ జన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే 
నమో గోపీ జన వల్లభాభ్యాం  

 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba