Online Puja Services

రుక్మిణి కల్యాణం మహత్యం

3.147.242.185
రుక్మిణి కల్యాణం మహత్యం :వివాహం కానీ కన్యాలకి పరిహారం

భారతీయ వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత వుంది ... మరెంతో ప్రత్యేకత వుంది. సంప్రదాయ బద్ధంగా కొనసాగే పెళ్లి పనులు, ప్రాచీనకాలం నుంచి వస్తోన్న ఆచార వ్యవహారాలకు అద్దం పడుతుంటాయి. ఆధునీక నాగరికత కొన్ని పద్ధతులను పక్కకి నెట్టేస్తున్నా, వివాహ వ్యవస్థ మాత్రం నేటికీ తన విశిష్టతను నిలబెట్టుకుంటూనే వుంది. వివాహమనేది స్త్రీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఆ విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు రాకపోవడం, వచ్చిన సంబంధాలు నచ్చక పోవడం యువతులను మానసిక వత్తిడికి గురిచేస్తుంటాయి. ఇంకొందరు తమకి సంబంధం నచ్చకపోయినా, పెద్దల మాట కాదనలేక తల వంచవలసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో యువతులు తమ దురదృష్టాన్ని నిందించుకుని కుమిలిపోతుంటారు. ఇలాంటి వారిని చూసిన మిగతా వాళ్లు కూడా తమ భవిష్యత్తును తలచుకుని ఆందోళన చెందుతుంటారు. తమ ఆశలకి ... ఆలోచనలకి తగిన వరుడు దొరుకుతాడో లేదోనని సతమతమైపోతుంటారు.

ఈ తరహా యువతులకి పరిష్కార మార్గంగా 'రుక్మిణీ కల్యాణం' పేర్కొనబడుతోంది. సంస్కృతంలో వ్యాసభగవానుడు రచించిన 'శ్రీ భాగవతం'లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీ కృష్ణుడిని భర్తగా పొందడానికి ఆమె పడిన ఆరాటం ... ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. సాధారణంగా వివిధ గ్రంధాలను పారాయణం చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన, యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతోంది.

రుక్మిణీ కల్యాణం చదవడం వలన ... యువతులకు ఇష్టంలేని సంబంధాలు తప్పిపోయి, కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. అలా జరగడం కోసం వ్యాసభగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. ఇక అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారిని ఈ విధంగా అనుగ్రహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.

1. ముందుగా శ్రీకృష్ణుని నిత్యపూజచేసి రుక్మిణీ కళ్యాణం పారాయణం ప్రారంభించాలి.

2. శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితముగా చదవాలి. 

3. మీ జన్మనక్షత్రము రోజుగాని, లేదా నామనక్షత్రము రోజుగాని పారాయణ ప్రారంభించండి. 

4. వీలయినంతవరకు శుక్రవారం, గురువారాలలో పారాయణ ప్రారంభించండి. 

మీకు వివాహము నిశ్చయము కాగానే ఎనిమిదిమంది కన్యలను పిలిచి (శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి) చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకమును దానముగా ఇవ్వండి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితముగా
లభిస్తుంది. 
 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba