Online Puja Services

దైవ ప్రార్థన

18.118.252.41

దైవ ప్రార్థన 

కరుణామూర్తి యగు దేవా! మా చిత్తము సర్వకాలసర్వావస్థలయందును మీ పాదారవిందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపుడు.

పరమదయానిధీ ! ప్రాతఃకాలమున నిద్రలేచినది మొదలు మఱల పరుండు వఱకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండు నట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను సద్బుద్ధిని దయచేయుడు.

సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా ! మా యంతఃకరణమునందు ఎన్నడును ఏవిధమైన దుష్ట సంకల్పముగాని, విషయవాసనగాని, అజ్ఞానవృత్తిగాని, జొరబడకుండు నట్లు దయతో అనుగ్రహింపుడు!

వేదాంత వేద్యా ! అభయస్వరూపా ! మా యందు భక్తి, జ్ఞాన, వైరాగ్య బీజము లంకురించి శీఘ్రముగ ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుడు ! మఱియు ఈ జన్మమునందే కడతేరి మీ సాన్నిధ్యమున కేతెంచుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుడు.

దేవా ! మీరు భక్త వత్సలురు ! దీనుల పాలిటి కల్పవృక్ష స్వరూపులు! మీరు తప్ప మాకింకెవరు దిక్కు? మిమ్ము ఆశ్రయించితిమి. అసత్తునుండి సత్తు నకు గొనిపొండు ! తమస్సునుండి జ్యోతిలోనికి తీసికొనిపొండు ! మృత్యువునుండి అమృతత్వమును పొందింపజేయుడు. ఇదే మా వినతి. అనుగ్రహింపుడు. మీ దరి జేర్చుకొనుడు.

పాహిమాం, పాహిమాం, పాహిమాం, పాహి

ఓం తత్ సత్

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba