యుద్ధం ఒకోసారి ఓర్పుతో జయించాలి
మహాభారత యుద్ధంలో అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్య చంపబడతాడు.
దానికి అతడు కోపోద్రిక్తుడై
"నారాయణాస్త్ర " అనే వినాశనకరమైన అస్త్రాన్ని పాండవ సైన్యంపై ప్రయోగిస్తాడు.
ఆ భయంకరమైన అస్త్రాన్ని ఎవ్వరూ ఆపలేకపోతారు.అది యుద్ధం చేస్తున్నవాళ్లను, చేతిలో ఆయుధాలు ఉన్నవాళ్లను, యుద్ధం చేద్దామనే ఆలోచన మనస్సులో ఉన్నవాళ్లను సైతం దహనం చేస్తూ స్వైరవిహారం చేస్తుంది, దాని ఎవ్వరూ నిలువరించలేకపోతున్నారు.
అప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల సైన్యాన్ని ఆయుధాలను విడిచి, చేతులు కట్టుకొని, యుద్ధ ఆలోచన సైతం మదిలో లేకుండా అలా నిలుచోమంటాడు.
నారాయణాస్త్రము మెల్లిమెల్లిగా తన శక్తిని ఉపసంహరించుకుంటూ, కొంత సమయానికి పూర్తిగా నిర్వీర్యం చెందుతుంది.
ఇలా పాండవ సైన్యం రక్షించబడుతుంది.
అన్నిసార్లు, అన్నిచోట్లా యుద్ధం కేవలం ఆయుధాలతోనే
విజయవంతం కాదు, కొన్నిసార్లు ముక్యంగా ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు మనం ఒక అడుగు వెనక్కివేసి, పనిమానేసి, ప్రశాంతంగా మంచి బుద్ధితో ఉన్నచోట కదలకుండా మేధాలకుండా ఉంటే విపత్తు దానికదే సమసిపోతుంది.
ఇప్పుడు కరోనా పట్ల కూడా ఎప్పుడో 5000 సంవత్సరాల క్రిందటి శ్రీకృష్ణుని యుద్ధ నైపుణ్యాన్ని మనం కూడా ప్రదర్శించి కరోనా మనపై ప్రకటించిన యుద్దాన్ని గెలవాలి.
ఇదొక్కటే దారి వేరే దారి లేదు