శని దేవుని రహస్యాలు
ప్రియ బంధువులారా ... శనిదేవుని గూర్చి కొన్ని అద్భుతమైన రహస్యాలు వివరిస్తాను.. పూర్తిగా చదవండి....
1...పురాణ పురుషులపై శనిగ్రహ ప్రభావం..
నలమహా రాజుకు అష్టమశని పట్టినప్పుడు.పాచికలఆటకు పురిగొల్పాడు శని.. చిరిగిన వస్త్రాలకు కారకుడు శని అగుటచే భార్య చీర చింపి అంగవస్త్రంగా ధరించి పారిపోయాడు.. బానిసత్వం చేయించే వాడు శని కనుక గుర్రాల కాపరిగా చేయించాడు... నలమహా రాజు శని కోపానికి ఎలా తయారు అయ్యాడో చూశారుగా....
2...అర్ధాష్టమ శని కాలంలో. ధర్మరాజు అరణ్యవాసం. రాజ్య భ్రష్టత్వం.. గౌరవ భంగం.. అందరికి తెలుసు...
3...ఆర్యుల అభిప్రాయం ప్రకారం సీతాదేవి అపహరణ జరిగే సమయాన శ్రీ రాముల వారికి ఏలినాటి శని అని చెప్పటం నిజం...
4....రావణ పుత్రుడు ఇంద్రజిత్ జన్మ సమయాన.. గ్రహాలు లాభస్థానమైన కుంభరాశి లో ఉండేలా రావణుడు శాశించినా. శని వ్యయ స్థానమైన మీన రాశిలో వున్నాడు.. ఆవిధంగా ఇంద్రజిత్ అల్పాయుష్షుకు శని కారకుడు.. కర్మఫలదాతను ఎవ్వడు నియంత్రణ చెయ్యలేడు..
5....అల్ప ఆయువుతో జన్మించిన మార్కండేయుడు శని అధిదేవుడు శివుని పుజించి శని అనుగ్రముతో చిరంజీవి అయ్యాడు ఇదీ అందరికీ తెలుసు...
శని అనుగ్రహం ముఖ్యమని ఇక్కడే తేలిపోయింది...
ఇక గ్రీకు పురాణాల ప్రకారం...
ఒడిపస్....అను రాజు జన్మకాల శని గ్రహ దోషంతో జన్మించటం.. వల్ల అడవుల్లో వదిలి వేయబడతాడు.. పెరిగి పెద్దవాడై ఆటవిక రాజ్యాలకు రాజై..రాజ్యం మీదకు దండెత్తి వచ్చి.. తండ్రిని చంపి తల్లిని వివాహం చేసుకుంటాడు.. తల్లిదండ్రులు అనే విషయం అతని కి తెలియదు... ఐనా సరే... మాతృ సంగమం...(అంటే తల్లితో సంభోగం చేయుట వావి వరుసలు లేని సంపర్కాలకు శని కారకుడు అనేది నిజం చేశాడు.... ఇలాంటి సంభాధాలకు మానసిక ప్రవృత్తికి.. మనో విశ్లేషకుడు సిగ్మాడ్ ప్రయిడ్ అనే మానసిక శాస్త్ర వేత్త..."" ఓడి పస్కాంప్లెక్స్"""అనే పేరు అతన్ని ఉద్దేశించే పెట్టాడు. రహస్యం మీకు తెలుసా.... ఇటువంటి మానసిక ప్రవృత్తి ఉన్నవార్ని పరిశీలిస్తే జాతకాలులో శనిగ్రహ దోషం కనిపిస్తుంది... పరిశోధన కూడా చేశాను... సన్నగా.. విపరీతంగా పొడుగు నరాలు కనిపించే వారిలో ఇది కనిపిస్తుంది...
2....ఇక.. ఖగోళం శని...
సూర్యునికి చాలా దూరంలో ఉన్న గ్రహాల్లో శని ఒకడు... గురువు సూర్యునికి....500మిలియన్ మైళ్ళ దూరంలో ఉంటే అంతకు మరింత దూరంలో శని ఉన్నట్లు గమనించారు సూర్యునికి.83కోట్ల.63.లక్షల మైళ్ళు దూరంలో ఉన్నట్లు కనుగొన్నారు..సూర్యుని చుట్టి రావటానికి.. ఈ ఒక్కడికే ఇరవై తొమ్మిదిన్నరసంవత్స రాలు పడుతుంది మరే గ్రహానికి ఇంత సమయంలేదు...భూమికన్నా..763.రేట్లు పెద్దది... అంటే ఇలాంటి భూమండ లాలూ...763...అక్కడ పెట్టవచ్చు.... దీన్నిబట్టి శనిగ్రహం ఎంత పెద్దదో అర్థమై పోతుంది... దీని కన్నా చిన్నవైన గ్రహాలు సూర్యునికి దగ్గరగా ఉండి అంత ప్రభావం చూపుతుంటే అదే శని దగ్గరగా ఉంటే జీవరాశిపై ఇంకా ఎంతటి ప్రభావం చూపేదో ఆలోచిస్తే భయం వేస్తుంది. కదా... నిజమే
3...స్తోత్రం శని మర్మం....
నీలాంజన సమాభాసం. రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. దీనిలో మర్మం చాలావున్నది చూడండి వివరిస్తాను...
నీలం*అంజనం... కలిపితే వచ్చేరంగు శనిగ్రహ నికి ఉన్నది.. నేటి ఆధునిక సైన్స్ ప్రకారం చూస్తే బ్లాక్ అండ్ నీలం... కాంతి వలయం. శనిగ్రహం విరజిమ్ము తున్నట్లు వివరించారు... సాటిలైట్ ఫొటోలు తీస్తే ఇటువంటి రంగుల వలయాలు కనిపించాయని. అమెరికా పరిశోధన తేల్చి చెప్పిన మాట గుర్తు తెచ్చుకోవచ్చు మీరు.. ..
ఇంకా లోతుగా పోతే... పశ్చిమ దిక్కులో గల ఏనుగు పెరు అంజనం... నీలం అంటే కొండ అనే అర్థం కూడా ఉన్నది. ..అంటే. నిలికాంతి కొండ*(అంటే శని పడమటి దిక్కుకు అధిపతి అని అర్ధం వస్తుంది)...""".ఇక యమా గ్రజం..."""యమ ధర్మ రాజుకు పెద్దన్న... యమునికి కాలాంతకుడు అనే పేరు ఉన్నది... అంటే యమా గ్రజం.. అంటే కాలాన్ని అంతం చేయగల యముని శాశించే అధికారం లేదా ధిక్కరించే అధికారం శనికి ఉన్నాయని అర్ధం..
ఇటువంటి శక్తులు ఉండబట్టే శని అన్న భయం. భక్తీ ఉన్నాయి... ఆయుష్షు తీయగలడు.. ఆయుష్షు పెంచగలడు శని....
జోతిష్యం ప్రకారం... మీనరాశి జలప్రళయానికి సూచిక... రాశీ చక్రంలో చివరి రాశి అగుటచేత. ప్రళయం అనంతరం సృష్టి తిరిగి చేయబడుతుంది... అంటే జీవరాశిలో మార్పు వస్తుందని అర్ధం.. ..జ్ఞాన చక్షు నమోస్తుతే అనే పేరును బట్టి పరిశీలన చేస్తే... ప్రారబ్ధ ఖర్మనుఅనుభవింప చేసి... మధనం నుండి అమృతం పొంది నట్లు కష్టాల అనంతరం సుఖాలు కలిగించి... జీవితం విలువలు తెలియ చేస్తాడు శని... ఇక...*** దేవాసుర మను శ్యాచ్చ సిద్ధి విద్యాధ రోరగా.త్వయావ లోకితా దైన్య మాసు వ్రజంతి.. బ్రహ్మ శక్రో యమచ్చయవ మునయస్యప్త తారకం....***..అని చెప్పుటచే... దేవతలు... రాక్షసులు... మనుషులు. సిద్ధులు.. విద్యాధరులు.. నాగులు. ఇంద్రుడు.. బ్రహ్మాది. సృష్టి కర్తలు. కూడా శనిగ్రహ దృష్టి వల్ల ధీనత్వం పొందుతారు అని అర్ధం.... అర్ధమైంది అనుకుంటాను.. వారికే దిక్కులేదు సామాన్యులం మనమెంత....
అవిద్యా మూల నాశాయ... అని కీర్తింప బడ్డాడు శని.... విద్య... అవిద్య.. అని రెండు రకాలు... లోక సంబంధ మాయా వలయంలో చిక్కుట... అవిద్య... దైవ శక్తులు తెలుసుకొనుట విద్య. ...అవిధ్యను రూపు మాపే శక్తి శనికి ఉన్నది.... ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమశని పేరుతో కష్టాలు కలిగించి... అజ్ఞానం తొలగించి... కష్ట పరంపరనుండి మరల్చి జ్ఞానం అనే విద్యవైపు మళ్లిస్తాడు. శని....
ఇక.. మకరరాశిదివ్య సంఖ్య పది.... ఒకటి ఆదికి మూలమైతే. నిండు సున్న అంతానికి మూలం.. దీనినే ఆద్యంతాలు అంటారు... సరళ రేఖా సదృశ్యమైనది ఒకటి కాగా... వక్ర రేఖా సదృశ్యమైనది నిండు సున్న.... ఈ రెంటి కలయిక. పది.. అది అంతాలకు మూలమైన పది. సంఖ్యారాశి మకరం.. దాని అధిపతి శని.. విచిత్రంగా లేదూ.. చావు పుట్టుకలు... ఒకటి సున్న... శని చావు పుట్టుకలకు కారకుడు...ప్రస్తుతం శని మకర రాశిలో వున్నాడు....1...0....లో... కష్టం కలిగించి.. మనలో మార్పులు తెచ్చి.. మంచి వైపుకు తెచ్చే ప్రయత్నం... అర్ధం చేసుకొని మసులుకొండి.... అందుకే ఇంత వివరణ ఇచ్చాను.... శని ఆరాధన చెయ్యండి.. పరివర్తన చెందండి... మార్పుకోసం ఇంతటి వివరణ ఇచ్చాను...
ఈ పోస్టుపై అభిప్రాయం చెప్పండి... ఇంకా ఉన్నది... కానీ అవసరం మేరకు వివరించాను
సర్వేజనా సుఖినో భవతు....
మీ.. రామలింగ వర ప్రసాద్. ప్రత్తిపాటి
ఖమ్మంలో నివాసం.
ఫోన్...9966456118...