Online Puja Services

పుట్టమన్నుతో శివలింగం, విప్ప నూనెతో ప్రయోగం

3.19.74.8

పుట్టమన్నుతో శివలింగం, విప్ప నూనెతో  ప్రయోగం

చర్మ సమస్యలు ఉన్నా ,భార్య భర్తల మధ్య విబేధాలు  ఉన్నా, చాలా కాలం గా సంతానం కలగకున్న, ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు వాయిదా పడుతున్నా, అన్నదమ్ముల మధ్య విరోధం ,ఆస్తి తగాదాలు ఇలాంటి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు పుట్ట మన్ను తెచ్చి ఆ మట్టిని శుభ్రంగా జల్లించి అందులో కొద్దిగా ఆవు నేతిని వేసి పన్నిటితో కలిపి యోని పానవట్టంతో శివలింగాన్ని తయారు చేసి ప్రతి రోజు ప్రదోషకాలంలో శివునికి విప్ప నూనెతో దీపారాధన చేసి అష్టోత్తరం తో విభూతి తో అర్చన చేసాక, ఏ సంకల్పంతో చేస్తున్నారో ఆ స్త్రోత్రం పారాయణ చేయాలి.   ధూపం చాలా ముఖ్యం , యధాశక్తిన నివేదన చేయాలి ఇలా 41 రోజులు  చేసాక ఆ పుట్టమట్టి శివలింగాన్ని నిమర్జన చేయాలి.  చెవి, కంటి సమస్యలు కూడా తగ్గుతుంది.  ఇది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వడంతో పాటు శివానుగ్రహం కలుగుతుంది..
 

విప్ప నూనె

ఆరోగ్య పరంగా ఆర్థికంగా ఏదైనా ప్రయోగం తో బాధపడుతున్నారు,  రావాల్సిన డబ్బు రాలేదు అంటే రోజూ ప్రదోషకాలంలో విప్పనూనెతో దీపం పెట్టండి.  మీ కులదేవత స్త్రోత్రం చేయండి.  ఫలితం చూడండి.  విప్ప నూనె దీపం పెట్టి శివారాధన చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతుంది,దుర్గా భైరవుడిని ఆరాధిస్తే శత్రుపీడ తొలగుతాయి, లక్ష్మీ ఆరాధన చేస్తే ధన నష్టం ఉండదు, వారాహి ఆరాధన చేస్తే భూమి వివాదాలు శత్రు బాధలు తొలగిపోతాయి, గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగిపోతాయి అప్పులు తిరిపోతాయి, స్వర్ణకర్షణ బైరావుడి స్త్రోత్రం, కనకధార చేస్తే రావాల్సిన బాకీలు వస్తాయి, లలితా సహస్రనామ పారాయణ చేస్తే సంపూర్ణ ఆయు ఆరోగ్యం ఐశ్వర్య సిద్ది కలుగుతుంది.  విప్ప నూనె తాంత్రిక పూజల్లో శీఘ్రoగా ఫలితం పొందడానికి కొన్ని, ప్రయోగాలకు ఉపయోగిస్తారు.  ఎందుకంటే అది గొప్ప విరుగుడు ... చాలా తక్కువ ధర కూడా 

హర హర మహాదేవ

- భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore