మాస శివరాత్రి - వైశిష్ట్యం

మాస శివరాత్రి - వైశిష్ట్యం
"మాస శివరాత్రి వ్రతకల్పం" అనే గ్రంధంలో శివరాత్రుల విశిష్టత గురించి వివరంగా తెలియజేయబడినది...
నిత్యశివరాత్రి , పక్ష శివరాత్రి,
మాస శివరాత్రి, యోగ శివరాత్రి, మహా శివరాత్రి అని వివిధ నామాలతో శివ పంచాక్షరిని జపిస్తూ శివలీలా మహత్యాలను గురించి తెలుసుకునేందుకు శివపురాణాలెన్నో మనకు వున్నాయి...
ప్రతి మాసం బహుళ పక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది,
భక్తులు అందరు ఈ మాస శివరాత్రిని క్రమం తప్పక అనుష్టిస్తారు...
మాస శివరాత్రి వ్రతం చేసేవారు
ముందురోజు ఒక పూట భోజనం చేసి శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసి వుండి మరునాడు
ఉదయాన్నే స్నానం చేసి శివనామం జపిస్తూ నాలుగవ ఝాము పూజ చేయాలి...
ఆ మరునాటి ఉదయాన
స్నానం చేసి ఈశ్వర దర్శనం చేసుకొని, భక్తులతో కలసి భుజించి శివనామ పారాయణ చేస్తూ
వ్రతం సంపూర్ణం చేయాలి...
ఈ మాస శివరాత్రి వ్రతాన్ని దేవతలంతా కూడా అనుష్టించినట్లు పురాణాలలో చెప్పబడింది.
చైత్రమాస బహుళ అష్టమినాడు
ఉమాదేవి పూజించినది.
వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి శివరాత్రినాడు సూర్యభగవానుడు పూజించాడు.
జ్యేష్ఠ మాస శుక్లపక్ష చతుర్దశి శివరాత్రి రోజున శివుడే తనను తాను పూజించుకున్నాడట...
ఆషాఢమాస బహుళ పక్షం పంచమి శివరాత్రి దినాన శివకుమారుడైన కుమారస్వామి పూజించాడు.
శ్రావణమాస శుక్ల పక్ష అష్టమి శివరాత్రి రోజున చంద్రుడు పూజించాడు.
భాద్రపద మాస శుక్లపక్ష త్రయోదశి శివరాత్రి రోజున ఆదిశేషువు పూజించాడు.
ఆశ్వీయుజ మాసశుక్ల పక్ష ద్వాదశి శివరాత్రినాడు ఇంద్రుడు పూజించాడు.
కార్తిక మాసంలోని రెండు శివరాత్రులు శుక్ల పక్ష సప్తమి, బహుళ పక్ష అష్టమి దినాలలో సరస్వతి దేవి పూజించినది.
మార్గశిరమాస శుక్ల పక్షంలోను, బహుళ పక్షంలోను వచ్చే శివరాత్రి దినాన లక్ష్మీ దేవి పూజించినది...
పుష్యమాస శుక్ల పక్షంలో నందీశ్వరుడు పూజించాడు.
మాఘ మాస బహుళ పక్షంలో దేవతలందరూ శివుని
పూజించారు...
ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో కుబేరుడుపూజించాడు...
జన్మ సాఫల్యానికి
శివపూజకు మించినదేముంది, కనుక!!!
- సేకరణ