Online Puja Services

సప్త విదంగ శివ స్థలములు:

18.224.70.11

ముచుకుంద చక్రవర్తి, గొప్ప ధైర్యవంతుడైన కోతి ముఖమున్న రాజు, ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేయడానికి ఈ ముచుకుండ రాజుని సహాయం అర్ధించి అతని సహాయముతో రాక్షసులను ఓడించాడు. కృతజ్ఞతగా, ఇంద్రుడు రాజు కోరుకున్నదానిని ఇస్తానని వాగ్దానము చేసెను. కాని రాజు మహా శివ భక్తుడు అయినందున, ఇంద్రుడు విష్ణుమూర్తి నుండి తనకు లభించిన ప్రేమతో ఆరాధించే సోమస్కంద విగ్రహము అడిగినపుడు దిగ్బ్రాంతి చెందెను. ముచుకుంద చక్రవర్తి మరే ఇతర బహుమతిని అంగీకరించలేదు. కాబట్టి ఇంద్రుడు విశ్వకర్మను ఇలాంటి మరో ఆరు మూర్తులను తయారు చేయమని ఆ ఆరు మూర్తులను అసలైన సోమస్కంద విగ్రహముతో ఉంచి వాటిలో ఏదైనా ఎంచుకోమని కోరుతూ రాజుకు అర్పించాడు. శివుని గొప్ప భక్తుడైన ముచుకుంద, భగవంతుడి సహాయంతో అసలైన విగ్రహాన్ని ఎంచుకున్నాడు. ముచుకుంద చక్రవర్తి భక్తికి ఇంద్రుడు సంతోషించి మొత్తం 7 మూర్తులను అతనికి బహుమతిగా ఇచ్చాడు. ముచుకుంద రాజు, భూమికి తిరిగి వచ్చి, ఆ ఏడు మూర్తులను వివిధ ప్రదేశాలలో ప్రతిష్ట చేశాడు, అసలు విగ్రహాన్ని తిరువారూర్ ఆలయములో ప్రతిష్టించాడు. ఈ 7 దేవాలయాలను సప్త విదంగ స్థలాలు అంటారు. విదంగ అంటే బయటకు రాని విషయం.

సప్త విదంగ స్థలాలన్నీ తిరువరూర్ చుట్టూ ఉన్నాయి అవి:

1• తిరువారూర్ - వీధి విదంగర్ - అజబా నృత్యము (విష్ణువు యొక్క ఛాతి వద్ద విశ్రాంతి తీసుకునేటప్పుడు అతని శ్వాసకు అనుగుణంగా చేసిన నృత్యము).

2• తిరుకరవోయిల్ - ఆధివిదంగర్ - కుక్కుడా నృత్యం (కోడిలా నృత్యం). 

3• తిరువోయిమూర్ - నీలా విదంగర్ - కమల నృత్యం (ఊగులాడుతున్న తామరపువ్వు వంటి నృత్యం) 

4• తిరుకువలై (తిరుకోలిలి) - అవని విదంగర్ - బ్రింగా నృత్రము (పువ్వులపై ఉపరి భ్రమణము చేయుచున్న తేనెటీగ వంటి నృత్యం) 

5• తిరునల్లారు - నాగ విదంగర్ - ఉన్మాత నృత్యం (మత్తులో ఉన్న వ్యక్తిలా నృత్యం) 

6• వేదారణ్యం - భువని విదంగర్ - హంస పథ నృత్యం (హంసలా నృత్యం)

7• నాగపట్నం - సుందర విదంగర్ - తరంగ నృత్యం (సముద్ర తరంగాలు).

శివుని 64 రూపములు

మహేశ్వర (అష్టాష్ట) ముర్తులు - 64

1) లింగ మూర్తి, నిరాకార రూపములో
2) లింగోద్భవడు, నిరాకారం నుండి ఉద్భవించే శివుని రూపం
3) ముఖలింగం, శివుని ఐదు ముఖాలతో లింగా రూపం
4) సదాశివమూర్తి, ఐదు ముఖాలతో శివుడు
5) మహాసదాశివమూర్తి, ఇరవై ఐదు ముఖాలతో శివుడు
6) ఉమామహేశ్వర మూర్తి ఉమాదేవితో
7) సుఖాసన మూర్తి
8) ఉమేశ మూర్తి
9) సోమస్కంద మూర్తి, శివుడు, ఉమాదేవి, స్కందుడు
10) చంద్రశేఖర మూర్తి, శివుడు చంద్ర వంకతో
11) వృషభరుదార్, నంది మీద శివుడు
12) వృషభాంతిక మూర్తి, నందితో శివుడు
13) భుజంగ లలితా మూర్తి, శివుడు పాముతో
14) భుజంగ త్రాస మూర్తి
15) సంధ్యన్రిత్త మూర్తి
16) సదాన్రిత్త మూర్తి
17) చండతాండవ మూర్తి
18) గంగాధర మూర్తి, శివుని జడలు కట్టిన జుట్టులోకి పడుతున్నగంగ
19) గంగవిసర్జన మూర్తి, గంగని విడుస్తున్న శివుడు
20) త్రిపురాంతక మూర్తి
21) కళ్యాణసుందర మూర్తి, శివ పార్వతుల కళ్యాణము
22) అర్ధనారీశ్వర మూర్తి, శివుడు పార్వతి ఒకే మూర్తి
23) గజాసుర సమ్హార మూర్తి
24) జ్వరాభగ్న మూర్తి - జ్వరహర మూర్తి
25) శార్ధూల హర మూర్తి, పులి వాహనముగా శివుడు
26) పాసుపత మూర్తి
27) కణ్కాల మూర్తి
28) కేశవార్ధ మూర్తి
29) బిక్షాటన మూర్తి, బిక్షాడుతున్న శివుడు
30) సింహఘ్న మూర్తి
31) చణ్డీశ అనుగ్రహ మూర్తి
32) వ్యాఖ్యాన దక్షిణా మూర్తి
33) యోగ దక్షిణా మూర్తి
34) వీణాధర దక్షిణా మూర్తి
35) కాలాంతకార్, కాల సంహార మూర్తి
36) కామ ధహన మూర్తి, మన్మధుడుని దహిస్తున శివుడు
37) లకుళీశ్వర మూర్తి
38) భైరవ మూర్తి
39) ఆపతుత్తారణ మూర్తి
40) వడుక మూర్తి, భైరవ
41) క్షేత్రపాల మూర్తి, భైరవుడు
42) వీరభద్ర మూర్తి
43) అఘోరాస్త్ర మూర్తి
44) దక్షయజ్ఞహర మూర్తి
45) కిరాత మూర్తి
46) గురుమూర్తి
47) అశ్వారూఢ మూర్తి
48) గజాంతికా మూర్తి
49) జలంధర వధ మూర్తి
50) ఏకపాద త్రిమూర్తి, త్రిమూర్తులు
51) త్రిపాద త్రిమూర్తి
52) ఏకపాద మూర్తి
53) గౌరీవరప్రద మూర్తి
54) చక్రదానస్వరూప మూర్తి, సుదర్శన చక్రము విష్ణువుకు దానము చేయుట
55) గౌరిళ్ళ సమన్విత మూర్తి
56) విషాపహరణ మూర్తి
57) గరుడాంతిక మూర్తి 
58) బ్రహ శిరచేధ మూర్తి 
59) కూరమ సమ్హార మూర్తి 
60) మత్స్య సమ్హార మూర్తి 
61) వరాహ సమ్హార మూర్తి 
62) ప్రార్ధనా మూర్తి 
63) రక్తాభిషేక ప్రదాన మూర్తి 
64) శిష్యభావ మూర్తి

మహేశ్వర మూర్తులు: 25

శైవ సిద్దాంత ప్రకారం భగవంతుడు నిరాకారుడు (అరుప). కానీ జీవుల మోక్షానికి అతను లిన్‌‌-గమ్ (అరుపా రుపా) రూపాన్ని తీసుకున్నాడు. లింగమును రూపంగాను మరియు నిరాకార చిహ్నంగా పరిగణించవచ్చు. ఈ మూర్తిని సదా శివ మూర్తి అని పిలుస్తారు. సదా శివ మూర్తి నుండి, జీవుల ప్రయోజనాల కోసం భగవంతుడు మహేశ్వర మూర్తులు అని పిలువబడే అనేక రూపాలు తీసుకున్నాడు. ఇలా ఇరవై ఐదు మహేశ్వర మూర్తులు ఉన్నాయి (కొందరు ఎక్కువ ఉన్నారని అంటున్నారు). ఈ ముర్తులలో కొన్ని భోగ మూర్తులు సాధారణంగా శక్తితో, రిషబరుదార్. యోగ మూర్తులు యోగా భంగిమలో ప్రక్కన శక్తి లేకుండా దక్షిణాముర్తిగా, లేదా కాలారి వంటి విధ్వంస స్థితిలో వేగ మూర్తులు ఉన్నాయి. సాధారణంగా దేవాలయాలలో, సదా శివ మూర్తి శివ లింగ రూపములో గర్భగుడిలో ఉంటుంది. మహేశ్వర మూర్తులు ప్రకారంలో ఉంటాయి. (గర్భగుడి వెలుపల). ఈ మూర్తులను స్తుతించి ధ్యానించే కొన్ని మంచి సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. 

1) బిక్షాటనార్ 
2) కమరి (కామారి, మన్మధుడి శత్రువు,) వీర మూర్తి.
3) కలరి (కాలారి, కాలుడి శత్రువు) వీర మూర్తి
4) కళ్యాణ సుందరార్, భోగ మూర్తి
5) రిషభరుధర్ 
6) చంద్రశేఖర్ (చంద్రుడు ఆభరణముగా) భోగ మూర్తి
7) ఉమామహేశ్వరుడు (ఉమా సమేత శివుడు) భోగ మూర్తి
8) నటరాజ (నాట్యము నకు రాజు) యోగ మూర్తి
9) త్రిపురాంతకర్ (అహం, కర్మ మరియు మాయ) వీర మూర్తి
10) జలంధరారి (జలంధర శత్రువు) వీర మూర్తి
11) గజసంహార మూర్తి (మాతంగారి, ఏనుగు శత్రువు) వీర మూర్తి
12) కరలర్ (వీరభద్ర) (భయంకరమైన) వీర మూర్తి
13) శంకరనారాయణర్ హరియర్ధ మూర్తి
14) అర్ధనారీశ్వరార్, భోగ మూర్తి
15) కిరాతర్ (కిరాతకుడు) (వేటగాడు)
16) కంకాళర్ (కంకాళ మూర్తి)
17) చండేష అనుగ్రహార్ (చండేష నయన్మార్ అనుగ్రహుడు) భోగ మూర్తి 
18) చక్రప్రధార్ (చక్ర దాత) భోగ మూర్తి
19) సహ ఉమస్కందార్(సోమస్కందార్) (ఉమ, స్కందునితో) భోగ మూర్తి
20) ఏక పాదార్ (ఒక కాలితో నిలుచొని బ్రహ్మ విష్ణు విలీనమయినటుల) 
21) గజముఖనుగ్రహార్ (విఘ్నేషనుగ్రహార్) భోగ మూర్తి
22) దక్షిణా మూర్తి, (దక్షిణ ముగము) యోగ మూర్తి
23) నీలకంఠార్ (నీల కంఠుడు)
24) లింగోద్భవార్ 
25) సుఖాసన్ (సుఖాసీనుడు) భోగ మూర్తి

ప్రధోష గొప్పతనం (ప్రధోష మహిమ)

దయాళు శివునికి చేసిన పూజలలో ప్రదోష పూజ ప్రధానమైన పూజలలో ఒకటి. శుక్ల పక్షంలో (అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15 చంద్ర రోజులు) మరియు కృష్ణ పక్షంలో (పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15 సూర్య రోజులు) త్రయోదశి సాయంత్రం (పదమూడవ చంద్రుని రోజు) సాయంత్రం 4.30 గంటల మధ్య. నుండి సాయంత్రం 6.00 వరకు. దీనిని ప్రధోష అంటారు. ఇది శుక్ల పక్షములో (పదిహేను చంద్ర రోజులలో) ఒకసారి వస్తుంది. ప్రదోష సమయం శివుడిని ప్రార్థించడం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడినది. ఆ సమయంలో ప్రార్థించుట వలన పాపాల నుండి విముక్తి కలిగి చివరకు మోక్షమును ప్రసాదించును (అందుకే ప్రధోష అని పేరు). ప్రదోష సమయంలో సోమ సుత్ర ప్రదక్షిణము(1) అని పిలువబడే ఒక ప్రత్యేక రకం ప్రదక్షిణ చేయుదురు.

ప్రధోష పురాణం:

ఒకసారి ధేవతలు మరియు అసురులు సర్పం వాసుకి మరియు కొండ మంధరలను ఉపయోగించి క్షీరాబ్తి (పాల మహాసముద్రం) నుండి అమృతం (నెక్టర్) ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు భయంకరమైన విషం హలహలం పైకి వచ్చినది. అందరూ భయపడి శివుడిని రక్షించమని వేడుకున్నారు. శివుడు ఆ విషాన్ని తిన్నాడు. అప్పుడు అతని ఆదేశం ప్రకారం వారు అమృతం పొందడానికి తమ ప్రయత్నాన్ని తిరిగి ప్రారంభించారు. వారు దానిని ద్వాదశి (పన్నెండవ చంద్రుని రోజు) నాడు పొందారు. ఎవరి ద్వారా వారు అమృతం పొందారో ఆ శివుని ప్రార్ధించకుండా, కృతజ్ఞతలు తెలపకుండా, , దేవతలు వారి విజయాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. 

త్రయోదశి (పదమూడవ చంద్రుని రోజు) నాడు వారు దేవుణ్ణి ప్రార్థించనందుకు చేసిన పాపాన్ని గ్రహించి క్షమించమని వేడుకున్నారు. సంతోషించిన దయగల శివుడు వారిని క్షమించి, నంది కొమ్ముల మధ్య నృత్యం చేశాడు. ఆ సమయాన్ని ప్రధోశం అంటారు. ఆ సమయంలో ఎవరైతే శివుడుని ప్రార్థిస్తారో, శివుడు వారి కోరికలను నెరవేర్చుతాడు మరియు వారికి ముక్తిని ఇస్తాడు. 

ప్రధోష సమయంలో అభిషేకం చేసేటప్పుడు (అభిషేకం) ఈ క్రింది వాటితో అభిషేకము చేసిన సఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

పాలు: దీర్ఘాయుషు ప్రాప్తి
నెయ్యి: మోక్షము ప్రసాదించును
పెరుగు: సంతాన ప్రాప్తి
తేనె: శ్రావ్యమైన గరళము ప్రాప్తి
వరి పిండి: అప్పుల బారి నుండి విముక్తి ప్రాప్తి
చెరకు రసము: ఆరోగ్య ప్రాప్తి
పంచామృతము: ధన ప్రాప్తి
నిమ్మరసము: మృత్యు భయము పోగొట్టును
లేత కొబ్బరి నీరు: సుఖ ప్రాప్తి
వండిన అన్నము: గౌరవమయిన జీవిత ప్రాప్తి
చందనము: లక్ష్మి దేవి అనుగ్రహ ప్రాప్తి

సోమ సూత్ర ప్రదక్షిణము:

R C R G
R C G
R C R – linga darshanam
R>రిషభము
C>చణ్డిచర్
G> గోముఖి

ప్రధోష (1) సమయంలో సోమ సూత్ర ప్రదక్షిణము అనేది భగవంతుడిని ప్రదక్షిణ చేయడానికి సూచించిన మార్గం. కొన్ని దేవాలయాలలో ఇది ఎల్లప్పుడూ అనుసరించబడుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, గోముఖి ఎప్పుడూ దాటకూడదు. అభిషేకం తరువాత నీరు (అభిషేక తిర్ధము) ఉత్తరం వైపుకు బయటకు ప్రవహించే ప్రదేశం గోముఖి. ప్రదక్షిణము ఈ విధంగా చేయడం ద్వారా ఈ పవిత్ర జలం దాట వలసి రాదు.

పైన గుర్తించిన చిహ్నాల ప్రకారం ఈ ప్రదక్షిణము చేయాలి. 1.మొదట రిషభుడు R (హోలీ బుల్) కు నమస్కరించి అసవ్యదిశలో (ఎడమ వైపు) వెళ్లి చండీషర్ (గోముఖీని దాటడం లేదు) కు వందనం చేయండి. 2.ఇప్పుడు సవ్యదిశలో (కుడివైపుకు) వెనుకకు వచ్చి రిషబముకు వందనం చేసి, గోముఖి వరకు సవ్యదిశలో కొనసాగండి (దాన్ని మళ్ళీ దాటవద్దు). 3.అప్పుడు అసవ్యదిశలో తిరిగి R రిషభముకు నమస్కరించి తిరిగి చండిషర్ వైపు కొనసాగండి. 4.అక్కడి నుండి R రిషభము ని ఆరాధించకుండా సవ్యదిశలో తిరిగి గోముఖి చేరుకోండి. 5.చివరగా R రిషభమ్‌కు నమస్కరించడానికి అక్కడి నుండి తిరిగి అసవ్యదిశలో తిరిగి వెళ్లి, చందీషర్‌కు కొనసాగండి. 6.అచట నుండి సవ్య దిశలో ^ రిషభమ్‌కు తిరిగి వెళ్లి, పవిత్ర ఎద్దు యొక్క రెండు కొమ్ముల మధ్యనుండి శివ లింగమును దర్శించి శివుడుని పూజించండి. ఇది ఒక ప్రదక్షిణము. ఈ విధముగా మూడు ప్రదక్షిణములు చేయాలి. ప్రదక్షిణము చేయడం ద్వారా గుర్తించబడిన వక్రతను మీరు జాగ్రత్తగా గమనిస్తే నెలవంకకు చాలా పోలి ఉంటుంది. అందువల్ల ఈ ప్రదక్షిణను సోమ సుత్ర ప్రదక్షిణము అంటారు.

- రాఘవ రావు 

 

 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda