మారేడు నీవని నేనేరి తేనా
శివునికి మారేడు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే? మారేడు కి మరోపేరు "శివిష్టం"అని అంటారు.
మరోపేరు "బిల్వదళం" మారేడు మహా మంగళ కరమైనది మారేడు ఆకులు త్రిశూలం ఆకరంలో ఉంటాయి మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు శివపూజలో మారేడు దళాలను తప్పనిసరిగా వాడతారు మారేడు దళాలతో పూజించినచో శివుడు త్వరగా అనుగ్రహిస్తాడు
కొందరు లక్ష బిల్వదళలతో పూజిస్తారు మరి కొందరు కోటి బిల్వదళలతో పూజిస్తారు దేవాలయం గర్బగుడిలో గాలిరాదు సూర్యకిరణాలు పడవు అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు చేత పూజ చేసినచో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి .
సూర్యుడులో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది.(అది మారేడు విశిష్టత) మారేడు మలినాలను పోగొడుతుంది.......
సూర్యుడులో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది.(అది మారేడు విశిష్టత) మారేడు మలినాలను పోగొడుతుంది.......
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్ ... శంభో శంకర