భక్తుడి జుట్టు ముడి వేస్తున్న భగవంతుడు
భక్తుడి జుట్టు ముడి వేస్తున్న భగవంతుడు!!!!
ఈ అద్భుతం బ్రిహదీశ్వరాలయం,గంగైకొండ,చోకలపురం,తమిళనాడు లో ఉంటుంది. ముఖ్య పట్టణం ను 1025CE లో చోళ వంశం లోని రాజేంద్ర ౹ నిర్మించాడు. రాజేంద్ర ౹ అనేవారు ఉత్తర,దక్షిణ బారతాలలో మిలిటరీ ని దిగ్విజయం గా నడిపించిన రాజు.అంతేకాదు సముద్రాల వెంబడి దక్షిణ - తూర్పు భాగాలు అయిన మలయా ,ఇండోనేషియా రాజ్యాల ను కూడా .
కింది శిల్పం శివుడు ఆయన భార్య పార్వతీదేవి ఇద్దరూ కూడా రాజేంద్ర ను ఆశీర్వదిస్తున్నారు. శివుడి కి ఉన్న అత్యంత పొడవైన , చుట్ట చుట్టిన జుట్టు దానినే జట అని అంటారు. ఈ శిల్పం 2 విషయాలను చెప్తుంది, మొదటిది స్వయంగా రాజుకు శివుడే కిరీటం పెడుతున్నాడా అన్నట్టుగా దాని ద్వారా దైవ.శక్తి రాజుకు రావడం,ఇక రెండవది అతను ఒక బలమైన పాలకుడు అయినప్పటికీ ఆ రాజు భగవంతుడికి ఒక దాసుడే అని.
పురాణాల ప్రకారం మరొక గాధ కూడా ఉంది,అది ఈ శిల్పం ద్వారా కూడా చెప్పవచ్చు.ఆయనే చండీష అందుకే దీనిని చండీషనుగ్రహమూర్తి పలక గా పిలుస్తారు.ఇది బ్రిహదీశ్వరాలయం లో ఉంది.