Online Puja Services

మనిషి లాంటి దేవుడు

18.222.23.166
దేవుడులాంటి మనుషులు అక్కడక్కడా ఉంటారు.కానీ అచ్చమైన మనిషిలాంటి దేవుడు మాత్రం-ఓకేఒక్కడు పరమశివుడు. శివున్ని ,శివతత్వాన్ని జీవితాలకు అన్వయించుకుంటే ముక్తి సిధ్దిస్తుందో లేదో నాకు తెలియదు..!! శివున్ని ఆరాధిస్తే మోక్షం లభిస్తుందో లేదో నాకు తెలియదు....!! 

కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను..సాటి మనిషికి సేవ చేయాలన్న కనీస మానవధర్మం గుర్తొస్తుంది, మానవత్వం మాత్రం సంపూర్ణoగ సంప్రాప్తిస్తుంది.మనం వేసే ప్రతి అడుగులో,మాట్లాడే ప్రతి మాటలో,తినే ప్రతి మెతుకులో,రాసే ప్రతి అక్షరములో శివుడు సంపూర్ణoగా ఎదుటివారికి అగుపిస్తూనే ఉంటాడు మనలో ఉండి....

ఆయనలోని నిరాడంబరత,నిర్మలత్వం, నిర్మొహత్వం,వైరాగ్యము,కుటుంబ బంధాలు,సామాజిక జీవనం,ఒంటరితనం,మనకి తెలియకుండానే మన జీవితములో భాగమైపోతాయి ఒకదానికొకటి సంబంధం లేకపోయినా..అన్నింటికీ మించి ఆఖండమైన దయ మనకి ప్రాప్తిస్తుంది.నేనేవ్వరికి చెప్పను శివున్ని ఆరాధించామని,శివున్ని పూజించండని, ప్రతి సోమవారం గుడికెళ్లి ఆయనకి అభిషేకం చేయించండని.. ఎవ్వరి ఇష్టాలు వారివి..కానీ శివభక్తీని మాత్రం ఒక్కసారి అనుభవిస్తే ఆ అనుభూతి అద్భుతము. ఆయన్ని గుడిలోనో ఇంకెక్కడో చూడకండి,చూసే ప్రతి చూపులో శివుడే,వేసే ప్రతి అడుగులో శివుడే, మాట్లాడే ప్రతి మాటలో శివుడే,రాసే ప్రతి అక్షరములో శివుడే,అనంత సూర్యకోటి సమప్రభుడైన ఆ పరందామున్ని గుడిలోనే బంధించకండి, ఆయన అన్నింటికీ ఆతీతుడు.ఆయనకి పూజలు చేసిన,చేయకపోయినా దానితో శివయ్య కి నిమిత్తం లేదు,చేయాల్సిందల్లా సాటి మనిషిని మనిషిగా గౌరవించడం,వీలైతే పక్కోడికి సేవచేయడము,అదే శివభక్తీ...... 

అందుకే "శివా!నన్ను ఆవహించవా.."అని వేడుకుంటున్నా,ఇదే నా నమకము,ఇదే నా చమకం, గుండెలోతుల్లోంచి పొంగుకొచ్చినా గద్యదండకం,వ్యాజస్థితీ అంతర్లీనం.....శివయ్య మన అందరిసొత్తు....

- Praveen Myatharla 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba