శివ పంచాక్షరీ న్యాసంతో శివపంచాక్షరీ
శివ పంచాక్షరీ న్యాసంతో
శివపంచాక్షరీ, మహామంత్రము ఇది అక్షర లక్షలు అనగా అయిదు లక్షలు చేయినిదే ఏ తంత్రమంత్రముగా సిద్ధించదు.
అస్యశ్రీ శివపంచాక్షరీ మహామంత్రస్య వామదేవ ఋషిః పంక్తిశ్చందః శ్రీ సాంబసదాశివో దేవతా | ఓం బీజం | నమః శక్తిః| శివాయేతి కీలకం! జపే వినియోగః||
ఓం సదాశివాయ
నం గంగాధరాయ
మం మృత్యుంజయాయ
శిం శూలపాణయే
వాం పినాకపాణయే
యం ఉమాపతయే ||
ఇతి కరహృదయాదిన్యాసః||
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం
త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతమ్ || నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశంవామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||
మంత్రం : ఓం నమశ్శివాయ
ఇలా 5 లక్షలు జపం చేయాలి. ప్రతి లక్ష పూర్తి కాగానే తర్పణం , హావనం, హోమం, అన్నశాంతి చేస్తే మంచిది. అలా చేయలేని వారు 5 లక్షలు పూర్తి చేసి మరో ఐదు లక్షలు జపం చేసి పూర్తి చేయవచ్చు..
వీలైనంత వరకు జప సంఖ్య పూర్తి చేసిన వారు బ్రాహ్మణులతో హోమం చేయించు కోవడం మంచిది. జపానికి రుద్రాక్ష మాల ,స్పటిక మాల, చందనం మాల లాంటివి వాడుకోవచ్చు..
వయసు పై బడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, నిత్య కర్మలు క్రమంగా ఆచరించలేని వారికి నియమం లెదు. వారు నామ స్మరణ చేసుకున్న చాలు.
- భానుమతి అక్కిశెట్టి