Online Puja Services

చాలా మందికి తెలియని పరమశువుని కథ

18.220.135.28
మీరు  ఇంతవరకు ఎప్పుడూ వినని, చాలా మందికి తెలియని పరమశువుని కథ
 
అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడు తన బిడ్డ ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డపైన ఏ తల్లి అయినా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కాని ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపించిందో తెలుసుకుందాం. అభవుడైన శివుని గూర్చి ఒక తల్లి ఆలోచనలో పడింది. శివుణ్ణి అభవుడు అంటారు కదా... అదేంటి....  ఆయనకు పుట్టుక లేదా..  ఏ తల్లి కడుపున పుట్టలేదా....  చాలా ఆశ్చర్యంగా ఉందే.
 
మరి శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు... అంతా అయోమయంగా ఉంది అనుకుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ఆమె బెజ్జమహాదేవి. ఆమె ముత్తవ్వగా, అమ్మవ్వగా శంకరుని చేతనే కీర్తించబడింది. నిత్యత్వాన్ని పొందింది. అమె లింగ పూజలు చేస్తున్నంత సేపు ఆమెలో తెలియని బాధ చోటుచేసుకుంది. శివుడు తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో.. అని బాధ పడింది. చివరకు బెజ్జమహాదేవికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది.
 
బెజ్జమహాదేవి బాలపరమేశ్వరుని చేసుకొని అతనికి ఎన్నో సేవలు, ఎన్నెన్నో పరిచర్యలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లియై పసిబాలుని అలా పెంచాలన్నదే ఆమె ఆలోచన. శివునికి ఏ కొరత లేకుండా చేయాలి అన్నదే ఆమె కోరిక. శివుడు శిశివు రూపంలో ఉన్నాడు కదా.. ఆ శివుడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది.
 
ఆమె తన కాళ్లను బారచాపి పసి లింగ మూర్తిని కాళ్లపై వేసుకొని లాల పోచింది. కనుముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా వత్తి తీర్చిదిద్దింది. పొట్టను వత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్ల దోసిళ్లతో చరచి వీపు నిమిరింది. ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే... అదే చేసింది ఈ తల్లి కూడా. ఉగ్గుపోసింది. పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్ర పుచ్చింది. ఆ తల్లి నిశ్వార్ధ ప్రేమకు లొంగిపోయాడు భోళాశంకరుడు. 
 
 హర హర మహాదేవ శంభోశంకర ఓం నమఃశివాయ
 
- రామనాథ్ పసుపులేటి 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba