పార్వతీపరమేశ్వరుల దశావతారాలు
పార్వతీపరమేశ్వరుల దశావతారాలు
శ్రీమన్నారాయణుని దశావతారాల గురించి అందరికీ తెలుసు... కానీ పార్వతీపరమేశ్వరుల దశావతాతాల గురించి చలా మంది వినివుండరు . అవేమిటో చదవండి ...
ప్రధమావతారము : మాహాకాళుడు, ఈయన అర్ధాంగి "మాహాకాళి" వీరిరువురూ భక్తులకు ముక్తినిచ్చే దైవాలు.
ద్వితీయావతారము : తారకావతారము, "తారకాదేవి" ఈయన అర్ధాంగి . సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు.
తృతీయావతారము : బాలభువనేశ్వరావతారము - సహచరి "బాలభువనేశ్వరీ దేవి" సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు.
చతుర్ధావతారము : షోడశ విశ్వేశ్వరుడు - "షోడశ విద్యేశ్వరి" ఈయన భార్య. భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు.
పంచమ అవతారము : భైరవ అవతారము - భార్య "భైరవి" ఉపాసనాపరులకు కోరికలన్ని ఇచ్చే దైవము భైరవుడు.
ఆరవ అవతారము : భిన్నమస్త -- "భిన్నమస్తకి" ఈయన పత్నీ.
ఏడవ అవతారము : ధూమవంతుడు -- "ధూమవతి" ఈయన శ్రీమతి.
ఎనిమిదవ అవతారము : బగళాముఖుడు -- "బగళాముఖి" ఈయన భార్య. ఈమెకు మరో పేరు బహానంద.
తొమ్మిదవ అవతారము : మాతంగుడు -- "మాతంగి" ఈయన భార్య.
దశావతారము : కమలుడు -- "కమల" ఇతని అర్ధాంగి.