క్రమశిక్షణ నేర్పుతోంది
ప్రతి వంద సంవత్సరాలకొకసారి విపత్తు వచ్చి అధికసంఖ్యలో మనుషుల్ని బలితీసుకోవడంతో పాటు మనలో మార్పులు తీసుకొస్తుందని మొన్న ఎక్కడో ఆదమరపుగా చదివి వదిలేసా!
కానీ ఆవిషయం ఎందుకో పదేపదే గుర్తుకువస్తుంది.
ఇప్పుడు కొంచెం బ్రిఫ్'గా ఆలోచిస్తుంటే
ఆ మార్పులు ఏంటో ఒక్కొక్కటిగా నిజమేమోనని అనిపిస్తుంది
"కరోనా"వైరస్
చాలామంది ప్రాణాలను బలితీసుకు(ంటు)న్న మహమ్మారి!
ఎట్ ది సేమ్ టైం,,,
"కరోనా" ఈజ్ ఇక్వల్ టూ "క్రమశిక్షణ"నేర్పుతున్న
మార్పు అనికూడా అనిపిస్తుందడోయ్.
ఏవిధంగా అంటే,
బయట బలాదూర్ తిరిగి వచ్చి కనీసం కాళ్ళు,చేతులు
కడగకుండా అన్నం ముందు కూర్చునేవాళ్ళని కూడా ప్రతి పదినిమిషాలకొకసారి సబ్బుతో చేతులు కడిగిస్తుంది.
మనకి ఒక కన్ను పోయినా పర్వాలేదు,పక్కోంటోడికి రెండు కళ్ళు పోవాలని ఆలోచించేవాళ్ళని కూడా మనతో పాటు పక్కింటివాళ్ళు కూడా బాగుండాలని అనుకునేలా చేసింది.
స్వదేశాన్ని విడిచి పరాయిదేశంలో ఉద్యోగం కోసం ప్రాకులాడేవాళ్ళని కూడా ప్రాణం మిగిలితే చాలు ఊర్లోనే ఏదోకటి చేసి బ్రతకొచ్చనే మైండ్ సెట్'కి తీసుకొచ్చింది.
ఇక ఆడపిల్లలను ఎన్.ఆర్.ఐలకి ఇచ్చి చేస్తే ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియా లోనో స్థిరపడితే వాళ్ళ భవిష్యత్తు బావుంటుందని ఆలోచించే తల్లితండ్రులకు కనువిప్పు కలిగించింది.
ఇక గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న నాలాంటి ఎంతోమందికి ఫ్యామిలీ విలువ నేర్పిందనుకుంటున్నాను,అక్కడ వంద సంపాదిస్తే వందే ఇక్కడ వంద సంపాదిస్తే పద్దెనిమిది రెట్లు అనే ఆలోచన తప్పని ప్రూవ్ చేసింది.
ఏపని లేకపోయినా ఇంట్లోవాళ్ళకి సాయం చెయ్యకుండా బయట తిరుగుళ్ళుకి అలవాటు పడిపోయిన(ఆడ/మగ) వాళ్ళ ని బుద్ధిగా ఇంట్లో కూర్చోబెట్టింది.
ఫారిన్ కల్చర్ అని ఫ్రెండ్స్ కనపడిన వెంటనే హగ్గులు,ముద్దులు, షేక్ హ్యాండ్స్'తో పలకరించేవారే వాళ్ళకి మనదేశ సాంప్రదాయాన్ని అదేనండీ రెండు చేతులతో నమస్కరించే అలవాటును మళ్ళీ కొత్తగా పరిచయం చేసింది.
బర్గర్'పిజాలు లాంటి చిరుతిళ్ళకు అలవాటు పడిపొయిన యువతకు బుద్ధిగా బంగాళదుంపలు, పెసరపప్పు తినేలా మార్చింది
చికెన్ తినేవాళ్ళకి చింతచిగురు
మటన్ తినేవాళ్ళకి మామిడికాయ పప్పు
చేపలు తినేవాళ్ళకి చేమదుంపలను
వెతుక్కొచ్చి మరీ తినేలా చేసింది
అన్నింటికంటే ముఖ్యంగా ఏ అవసరం లేకపోయినా మీదమీద పడిపోయి మాట్లాడుకునే వాళ్ళని మీటర్ల దూరం నుండి పలకరించుకునేలా మార్చేసింది.
ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొన్నివేల ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు ఆర్ధిక పరిస్థితి కూడా తలక్రిందులు చెయ్యడం బాధాకరం.
ఏది ఏమైనా అతితక్కువ కాలంలోనే విధ్వంసం సృష్టిస్తున్న ఈ వైరస్ క్రమేపీ తగ్గుముఖం పట్టాలని,మనతో పాటు అన్ని దేశాల ప్రజలు
ప్రపంచంలో అందరి ఫ్యామిలీలు భావుండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుందాం!
Quote of the day
__________Rabindranath Tagore