నీ ధర్మం గొప్ప ముందు నువ్వు తెలుసుకో
కధ చెబుతా ఓపికగా వింటారా !
అవంతిపురం అనే గ్రామంలో రామయ్య అనే కట్టెల వర్తకుడు ఉండేవాడు,ఆయనకు భార్య లక్ష్మీ , వారి కొడుకు చిన్నా వున్నారు, ఆయన అడవికి వెళ్లి కట్టెలు కొట్టి మోపు కట్టి ..వారపు సంతలో అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు.చిన్నా .. పెద్దవుతున్నా ఏ బాధ్యతా లేక తిరిగేవాడు. ఆ ఊరిగ్రామ దేవత అంకాలమ్మ తల్లి జాతర 5ఏళ్లకోసారి జరుగుతుంది,చుట్టుపక్కల గ్రామాలనుండి వేలల్లో తిరునాళ్లకు వస్తారు.పగటి వేషాలు,డప్పు వాయిద్యాలు,తినుబండారాలు, ఆటబొమ్మలు,మొక్కుబడులు, సాంస్కృతిక ప్రదర్శనలతో పండుగలా జరుగుతోంది. కుస్తీ పోటీలు కూడా పరువుగా తీసుకుని నిర్వహిస్తారు. చివరిరోజు కుస్తీల్లో ఆ ఊరి వస్తాదులు అందరూ వేరే గ్రామాల వస్తాదులు చేతిలో మట్టి కరిచారు.అదే జాతరకు తల్లిదండ్రులు తో వచ్చిన చిన్నా ..."ఆ పక్కూరి వస్తాదులు అంతా సమర్థులు ,మా ఊరివాళ్ళు అందుకే మట్టి కరిచారు" అని నవ్వుకున్నాడు,కానీ అదే సమయంలో తన పక్కన ఉన్న తండ్రి ..తన తెల్ల అంగీ విప్పి లుంగీ గోచీలా కట్టి బరిలోకి వెళ్ళటం చూసి వారించబోయాడు ,కానీ తల్లి ఆపేసింది.."రోజూ కట్టెలు కొట్టే మొద్దు లాంటి మా నాన్న వారితో ఒక పట్టు ఐనా నిలబడతాడా ?" అని అనుకుంటూ తండ్రిని నిశితంగా చూసాడు. కట్టెలు కొట్టి .. కాయలు కాచిన చేతులు ..వంపులు తిరిగిన కండలు ..ధనుస్సులా మారిన బాహువులు ...పొలం దున్నే ఆబోతుల గిట్టల్లాంటి కాళ్ళతో ...భూదేవితో ఆటలాడే నల్లని నారాయణుడిలా తన తండ్రి కనిపించాడు. జాతర పెట్టిన ఊరి పరువు తన తండ్రి చేతిలో ...ఎలా అని కలవరపడుతూ ఆ హనుమంతుని కళ్ళు మూసుకుని తలిచే లిప్తకాలంలో "ఆ" అన్న ఆర్తనాదం వినిపించి కళ్ళు తెరిచేసరికి పక్క ఊరి వస్తాదు మట్టి కరిచాడు..
"శభాష్ ...రామయ్య నీలోని వస్తాదు 15 ఏళ్ళైనా రోషంగానే ఉండాడు" అని ఊరి పెద్దలు జబ్బలు చరచుకున్నారు. ఊరంతా చప్పట్లు,జయజయ ధ్వానాలు ...మిన్నంటాయి. చిన్నాకు ఆశ్చర్యంగా ఉంది ...తాను రోజూ చూసే తండ్రిలో ఇంత వీరుడున్నాడా ? తన కంచంలో కూర నాకు వేసి రోటి పచ్చడి,పుల్ల మజ్జిగ తో చద్దన్నం తినే నాన్నలో ఇంత వస్తాదు ఉన్నాడా ? ..అని పశ్చాత్తాపంతో వెళ్లి తండ్రిని కౌగిలించుకున్నాడు..
----కధ సమాప్తం -----
నీ తండ్రి గొప్పతనం తెలియకుండా ఉంటే పక్కోడి తండ్రి గొప్పగా కనిపిస్తాడు. అలాగే నీ గ్రంధాల గొప్పతనం తెలియకపోతే ఎడారి మతాల గ్రంధాలు గొప్పగా అనిపిస్తాయి.నీ దేవుళ్ళ వీరత్వం,సుగుణత్వం,తెలియకపో
అందుకే అన్ని మతాలు సమానం అనేవారు ముందు అన్ని మత గ్రంధాలు చదివి ఆ మాట అనాలి.అలాగే మన పురాణేతిహాసాలు కనీస మాత్రమైనా చదవాలి.మన గ్రంధాలలో వేరే మతాల,వేరే దేవుళ్ళ ప్రస్తావన ఉండదు ఎందుకంటే అప్పటికి ఏ మతాలు పుట్టలేదు కనుక !ఎడారి మతాల గ్రంధాలలో "విగ్రహారాధికులను చంపమని" "కాఫిర్ లు అందరిని చంపమని "రాయబడింది. కాబట్టి ముందు తండ్రి లాంటి సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకోండి,తర్వాత పీనుగ దేవుళ్ళ పుట్టగొడుగు మతాల మర్మం తెలుసుకోండి..
సర్వేజనాస్సుఖినోభవంతు..