మన ధర్మానికి వక్ర భాష్యం
1. ప్రచారం:- ఎన్ని యజ్ఞాలు, యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - (35 వ సూక్తం )
సమాధానం : ఇదొక అబద్ధం. ఇలాంటివన్ని ప్రక్షిప్తములు, ఆంగ్లేయుల ప్రోద్బలముతో చేర్చబడినవే. మను ధర్మశాస్త్రంలో సూక్తాలు లేవు. అసత్యాలతో కూడిన కొన్ని శ్లోకాలు 18 వ శతాబ్దంలో కొందరు చేర్చటం జరిగింది. అదెలా జరిగిందో వివరిస్తాను. మనుస్మృతిని వ్రాసినది సుమతి భార్గవాచార్యుడు. దీని మూల ప్రతి పాఠం ఎక్కడా లభ్యంగా లేదు. వివిధ ప్రాంతాలలో ఒకదానికి ఒకటి పొంతనలేని సంస్కృత పాఠ భేదాలు ఉన్నాయి. బెంగాలు బ్రాహ్మణుల నుండి ఒక ప్రతి సేకరించి దీనిని తొలిసారిగా 1794 లో ఆంగ్లంలోకి అనువదించి పబ్లిష్ చేసింది సర్ విలియం జోన్స్ అనే ఇంగ్లీషు వాడు. వాడు ప్రకటించినది అబద్ధపు ప్రతి అని బెంగాలు బ్రాహ్మణులు అప్పటిలో వ్యతిరేకించటం కూడా జరిగింది. దీనిని బట్టి ఆ ప్రతిలో తెల్లజాతి పందులు సంస్కృత పాఠాన్ని కూడ తమ ఇష్టం వచ్చినట్లు మార్పులు చేయించారని అర్థం అవుతున్నది. భారతదేశంలో అప్పటి ప్రభుత్వం భారతీయులకొరకు ఈ మనుస్మృతిని ఆధారంగా చూపి చట్టాలు చేసారు. నేను చెప్పింది నిజం అని నిరూపించటానికి ఆధారంగా మనుస్మృతిలోనిదే ఈ క్రింది ఒక్క శ్లోకం చాలు:-
శ్లోకం - అనుమంతా విశసితా నిహంతా క్రయ విక్రయీ
సంస్కర్తా చోపహర్తా చ ఖాదకశ్చేతి ఘాతకా: || - మను. 6-51
ఒక జంతువును చంపిన పాపాన్ని 8 మంది పంచుకుంటారని మను ధర్మ శాస్త్రము చెప్పుచున్నది.
1.అనుమంతా = జంతువును చంపుటకు అనుమతించు వాడు.
2. విశసితా = జంతువు తోలు వలిచే వాడు లేదా మాంసమును ముక్కలుగా చేయువాడు.
3. నిహంతా = జంతువును చంపువాడు.
4. క్రయీ = ఆ మాంసము కొనువాడు.
5. విక్రయీ = మాంసము అమ్మేవాడు.
6. సంస్కర్తా = దానిని శుభ్రపరచి వండే వాడు.
7. ఉపహర్తా = వడ్డించే వాడు.
8. ఖాదకశ్చ = ఆ మాంసాహారం తినేవాడు కూడా ఘాతకులే, పాపమును పొందిన వారే. మనుధర్మశాస్త్రం మాంస భక్షణ చేయ వద్దనే చెప్పింది.
జంతు వధ పాపము అని ఇంచు మించు అన్ని ధర్మ శాస్త్రాలు చెప్పాయి. ఎక్కడన్న ఉందీ అంటే అది కేవలం ప్రక్షిప్తం. అసలు మన చరిత్రనే పూర్తిగా వక్రీకరించడం జరిగింది.
2. ప్రచారం – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు, పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ( కౌటిల్యుని అర్ధ శాస్త్రం )
సమాధానం : అలా వ్రాసింది ఆర్య చాణక్యుడు కాదు. చాణక్యుని పేరుతో కంపెనీ వారి బూట్లు నాకిన రుద్రపట్నం శామశాస్త్రి అనే మైసూర్ లైబ్రరియన్ . అర్థ శాస్త్రాన్ని ఆధునిక యుగంలో వెలికి తీసి ఆంగ్లం లోకి అనువదించి దాన్ని బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ యజమాని రోత్ షిల్డ్ గారికి భక్తితో సమర్పించిందీ ఆ బ్రాహ్మణోత్తముడే. రోత షిల్డ్ యూదుజాతికి ఆరాధ్య దైవం. ప్రపంచ రాజకీయాలను ఆనాటి నుండీ ఈనాటివరకు పరోక్షం గా శాసిస్తున్న కుటుంబాలకు మూల పురుషుడు. " Artha Shastra of Chanakya (manuscript ) of the 4th-century BCA was unearthed from a dusty heap of palm-leaf manuscripts, by scholar Rudrapatnam Shamasastry who published it in 1909. ( after 2300 years all of a sudden he had unerthed it )
ఆర్య చాణక్యుడు ఆర్షదర్మాన్ని గౌరవించే వాడు.. శుద్ధ శాకాహారి. ఆయన కుటిలుడు అని బ్రాహ్మణులంతా ఒకప్పుడు మాంసాహారులని అర్థ శాస్త్రం ద్వారా ప్రూవ్ చేయాలని కావలసినంత వ్రాసి దాన్ని వెలుగులోకి తెచ్చారు. అర్థ శాస్త్రం ఆమూలాగ్రం చదివి పరిశీలిస్తే పరస్పర విరుద్ధమైన శ్లోకాలను గమనిస్తే మనకు ఏవి ప్రక్షిప్తాలో ఈజీగానే తెలుస్తాయి.
3. ప్రచారం. – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సులో వున్న ఎద్దుది కానీ భుజించాలి “ (శంకారాచార్యులు)
సమాధానం : శంకారాచార్యుల వారు అటువంటి మాట ఎక్కడా వ్రాయలేదు. అసలు పూర్వమీమాంసను అన్ని కర్మకాండలను వ్యతిరేకించారు జగద్గురువులు. అంధకారంలో, మలకూపంలో బ్రతికే వారు మాత్రమే పరమ హంసల యెడల ఇటువంటి దుష్ప్రచారం చేస్తారు.
4. ప్రచారం – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మలో) భాగంగా ఆవునో, ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ( ఋగ్వేదం 10 ,14 -1 )
సమాధానం : ఇది పూర్తిగా అబద్ధం. ఋగ్వేదంలోని ఆ మంత్రాన్ని ఇక్కడ ఉదాహరించి తాత్పర్యం ఇస్తున్నాను.
చదివితే నిజం ఏమిటో మీరే గ్రహించగలరు:-
మంత్రం - పరేయివాంసం ప్రవతో మహీరను బహుభ్య: పంథాం అనుపస్ప శానమ్ |
వైవస్వతం సంగమనం జనానాం యమం రాజానం హవిషా దువస్వ || ఋ.10-14-1
తా- ఓ ఉపాసకుడా! నీవు పితరేశ్వరుడైన యముని సేవింపుము. ఆయనకు హవిస్సునొసగి తృప్తి పరచుము. ఆయన శ్రేష్ట కర్మలు (మంచి పనులు) చేయువారిని సుఖ సంపన్న లోకమునకు చేర్చును. కనుకనే మరణించిన ప్రతివారు ఆయనను చేరుచున్నారు. - ఈ మంత్రంలో "హవిషా" హవిస్సు అనే మాట తప్ప ఆవు ప్రసక్తి కాని ఎద్దు ప్రసక్తి కాని ఉందని చెప్పేవాడిని చెప్పుతో కొట్టవచ్చును.
తెలుసుకోనలసిన అంశాలు :
అనేక అభూత కల్పనలతో వేదమంత్రాలకు వక్ర భాష్యాలతో భారతీయ సంస్కృతిపై విషం వేదజల్లుచున్న వారిని ఎన్నడూ నమ్మవద్దు. తీర్థంకరుడైనా, గౌతమ బుద్ధుడైనా, శ్రీ శంకరాచార్యులవారైనా, శ్రీ మద్రామానుజులైనా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారైనా అహింసా పరమో ధర్మ: అని బోధించిన వారే. అసలు మనది వ్యవసాయంపై ఆధార పడిన దేశం. పశు హింసను ఏనాడూ ప్రోత్సహించలేదు. వేదకాలంలో మన జీవితం ఎలా ఉండేదో కొన్ని ఉదాహరణలు ఇస్తాను. కులవృత్తులను గూర్చి వ్యవసాయం గూర్చి వేదం లోని కొన్ని మంత్రాలు ఇక్కడ మీకోసం ఇస్తున్నాను శ్రద్ధగా చదవండి.
ఋగ్వేదం 2వ మండలం, 3వ సూక్తం, 6వ ఋక్కు: బట్టలు నేయుట.
1. సాధ్వపాంసి సనతా న ఉక్షితే ఉషసా నక్తా మయ్యేవ రణ్వితే |
తంతు తతం సంవయంతీ సమీచీ యజ్ఞస్య పేశ: సుదుఘే పయస్వినీ ||ఋ.2-3-6
తాత్పర్యం:- ఉత్తమ కర్మలు చేయుటకు ప్రేరేపించు ఉషాదేవి మరియు రాత్రి దేవి ఇరువురు కులస్త్రీలవలె పరస్పరము సహకరించుకొనుచు యజ్ఞము చేయుచున్నట్లు వెలుగు దారములతో కీర్తి వస్త్రమును నేయుచు వెడలుచున్నారు. వారు వెలుగు జలమునును కురిపించి మన అభీష్టమును నెరవేర్చెదరు..
ఋగ్వేదం 3వ మండలం, 53వ సూక్తం, 19వ ఋక్కు: బండ్లు, రధములు మరియు లోహపు పనులు చేయుట.
2. అభి వ్యయస్య ఖాదిరస్య సారమోజో ధేహి స్పందనే శింశపాయామ్ |
అక్ష వీలో వీలిత వీలయస్వ మా యామాదస్మాదవ జీహిణో న: || ఋ.3-53-19.
తాత్పర్యం:- ఓ ఇంద్రా ! రథ నిర్మాణమున ఉపయోగించిన చేవగల చండ్రకఱ్ఱకు మంచి దృఢత్వము నిమ్ము! శింశుప కాష్ఠముతో జేసిన దానిని బాగా దృఢపరచుము. ఓ ఇరుసా ! నీవు బలముగా నిర్మించ బడితివి. మేము రథములో వేగముగా వెళ్లునపుడు మమ్ము రథము నుండి వేరుపరచనని చెప్పుము.
ఋగ్వేదం 1వ మండలం, 140వ సూక్తం, 10వ ఋక్కు: బంగారు పని చేయుట.
3. అస్మాకమగ్నే మఘవత్సు దీదిహ్యాధ శ్వసీవాన్ వృషభో దమూనా: |
అవాస్యా శిశుమతీ రదీదేర్వర్మేవ యుత్సు పరిజర్భురాణ: ||
తాత్పర్యం:- ఓ అగ్నీ | నీవు దానశీలురైన వారి గృహమునందు ప్రదీప్తమైన వృషభము వలె శ్వాసించుచున్నావు. అయినను ఇప్పుడు యుద్ధమునకు బయలుదేరుటకై స్వర్ణ కవచమును ధరించిన బాలకుని వలె మెరిసి పోవుచున్నావు.
ఋగ్వేదం 4వ మండలం, 57వ సూక్తం, 1 మరియు 8వ ఋక్కులు: కృషి విద్య.
4. క్షేత్రస్య పతినా వయం హితేనేవ జయామసి|
గామశ్వం పోషయిత్న్వా సనో మృలాతీదృశే || ఋ.4-57-1
తాత్పర్యం:- మన బంధువు వంటి క్షేత్రపతితో కలిసి యజమానులమైన మనము ఈ క్షేత్రమును జయించెదము గాక. ఆయన మన గోవులను, అశ్వములను పోషించు చున్నాడు.
5. శునం న: ఫాలా: వి కృషంతు భూమిం శునం కీనాశా అభియంతువాహే |
శునం పర్జన్యో మధునా పయోభి: శునాసీరా శునమస్మాసు ధత్తమ్|| ఋ.4-57-8
తాత్పర్యం:- అతడు సేద్యమును ఫలింపజేయు జలము కొరకు మంచి భూమి యందు కుంటను త్రవ్వుగాక. కర్షకుడు అన్న సౌఖ్యము కొరకు ఎడ్లతో భూమిని దున్నుగాక. మేఘములు మధురమైన జలములను వర్షించి భూమిని జలముతో పరిపూర్ణము జేయుగాక. ఓ క్షేత్రాధిపతులారా! అన్నాధిపతులారా! మమ్ము సుఖింప జేయుడు.
ఋగ్వేదం 10వ మండలం, 101వ సూక్తం, 3 మరియు 7వ ఋక్కులు: బావులను త్రవ్వి నాగళిని చేసి విత్తులు చల్లదం వంటి విషయాలు.
6. యునక్త సోరా వి యుగా తనుధ్వం కుతే యోనౌ వపతేహ బీజమ్|
గిరా చ శృష్టి : సభరా అసన్నో నేదీయ ఇత్ సృణ్య: పక్వ మేయాత్ ||ఋ.10.101.3
తాత్పర్యం:- ఓ ఋత్విజులారా ! కృషి ఫలం సాధించవలెను. గోవులను (ఎడ్లను) నాగళ్లకు కట్టండి. ఈ పొలంలో విత్తనాలు నాటాలి. మన స్తుతుల ద్వారా అధిక పరిణామంలో అన్నం ఉత్పన్నమగునట్లు స్తుతించెదము గాక. ఆ తదుపరి పక్వస్థితిలో ఉన్న మంచి విత్తనములను చల్లెదము గాక !
7.ప్రీణీతాశ్వాన్ హితం జయాథ స్వరితవాహం రథమిత్ కృణుధ్వమ్ |
ద్రోణాహ వమవతమశ్మ శ్చక్రమం సత్రకోశంసించతా నృపాణమ్|| ఋ.10.101.7
తాత్పర్యం- ఎడ్లకు భోజనం పెట్టి తృప్తి పరచండి. పొలంలో కోయబడి కుప్పవేసిన ధాన్యమును గ్రహించండి. తదుపరి మోయుటకు తగిన రథము (బండి)ద్వారా ధాన్యమును కొనితెండు. పశువుల కొరకు ద్రోణముల ద్వారా రాతి తొట్టిలో నిండుగా జలము నింపండి.
ముగింపు - పశువుల సహాయంతో వ్యవసాయం చేయమని పశువుల్ని పోషించమని మాత్రమే సనాతన ధర్మం చెప్పింది..!!
సేకరణ: కోట శంకరరావు (సినీ మరియు టీవీ నటులు)