Online Puja Services

భూమిని ఆది శేషువు మోస్తున్నాడా?

3.145.7.187

భూమిని ఆది శేషువు మోస్తున్నాడా?

దానికి సాంకేతిక నిర్వచనం ఏమిటి?

సౌందర్యలహరి లో ఆది శంకరులవారు అమ్మవారిని ఇలా అర్చిస్తారు :
తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||

తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.

మన వేదాంగాల ప్రకారం విష్ణువే ఆది శేషుని రూపంలో చతుర్దశ భువనాలను మోస్తున్నాడని ప్రతీతి. ఏమిటి ఈ చతుర్దశ భువనాలు 
భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం (ఊర్ధ్వలోకాలు)
భూలోకం (మధ్యలోకం)
అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు (అధోలోకాలు)
ప్రత్యేకించి భాగవత పురాణంలో బ్రహ్మదేవుడు ఆదిశేషుని భూలోకాన్ని స్థిరీకరించమని ఆదేశించినట్లు చెబుతారు. అందువలన శేషువు పడగపై భూమి వుందని అది ఎల్లవేళలా మోస్తూ ఉంటుందని పురాణవచనం.
దీనిలో శాస్త్రీయత గురించి ఇప్పుడు కొంత చర్చించుకుందాము.

శంకరాచార్యుడి కాలానికి ఇండియాలో ఆస్ట్రానమీ, దాని ఆధారంగా జ్యోతిష శాస్త్రం వృద్ధి చెందాయి. వరాహ మిహిరుడు అప్పటికే అయనాంశ (shift of equinoxes) లెక్క కట్టాడు. ఆర్యభట్ (I), భాస్కర (I) ప్రసిద్ధులయ్యారు. సో, శ్లోకరచనలో శంకరుడు దివ్యదృష్టితో కాక తన శాస్త్రజ్ఞానంతోనే ఈ ఆస్ట్రనామికల్ అంశం ఇమిడ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ శూన్యమైన ఆకాశంలో గ్రహ గోళాల్ని ఏ అదృశ్యశక్తి మోస్తున్నదనే విషయానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే భూకక్ష్యలో మార్పులకి ఆదిశేషుడు తలలు మార్చుకోవడమనే ఊహ(?) జోడించి అందంగా వర్ణించాడు. శంకరుడి వర్ణనకి, మోడర్న్ సైన్సు ఇచ్చిన వివరణకి పోలిక ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. శ్రీ జీ ఎల్ యెన్ శాస్త్రిగారు కొంచెం శాస్త్రీయత జోడించి వివరించారు.
భూమికి నాలుగు రకాల చలనాలున్నాయి.
౧. తన చుట్టూ తాను తిరగడం (ఆత్మ ప్రదక్షిణ) – rotation
౨. సూర్యుని చుట్టూ తిరగడం – revolution

౩. ఉత్తర దక్షిణ ధ్రువాలు తారుమారు అవ్వడం 
మన భూమి సూర్యుని చుట్టూ ఒకే కోణం లో తిరగదు. ఒక బొంగరం తన కోణం మారుస్తూ తిరుగుతున్నట్టు తిరుగుతుంది. అది తిరిగేటప్పుడు ధ్రువ నక్షత్రాన్ని రిఫరెన్స్ గా ఒక వృత్తంగా తిరుగుతుంది. మనవారు మేరు పర్వతం చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి ఇది సహేతుకమైన వర్ణన. ఇక్కడ ఇచ్చిన బొమ్మ మీకు వివరంగా వివరిస్తుంది. 

౪. సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య ఒకే రకంగా వుండదు. ఆ కక్ష్య కోణం మారుతూ వుంటుంది. 
భాస్కరాచార్యుల వారు స్థిరీకరించిన సూర్యసిద్ధాంతం ప్రకారం దీనిని ఆయనాంసం అని అంటారు. మన భారతీయ సిద్ధాంతాన్ని 2BCలో జెర్మన్లు వారు నేర్చుకుని వారి ఆస్ట్రాలజీ సిద్ధాంతం ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ ఆయనామ్సం మరిచారు. తరువాత భూమి కొన్ని 13డిగ్రీలు మారింది. అందుకే మన జాతక శాస్త్రం చాలా ఇతిమిద్ధంగా చెప్పగలదు. 

సూర్య సిద్ధాంతం ప్రకారం ఒక సరి అయిన ఆయనాంసం revolution కి 432000000(ఒక కల్ప యుగానికి సంవత్సరాలు) / 169669 = 25461 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రతి 25వేల సంవత్సరాల తర్వాత ఉత్తరాయనం దక్షిణాయనం అంశాలు మారిపోతాయి. నేటి లెక్కల ప్రకారం 25772 సంవత్సరాలు పడతాయని టెలిస్కోపుల ద్వారా కనుకొన్నారు. 
అంటే ఈ లెక్క కట్టాలంటే మనవారిదగ్గర ఎంత గొప్ప టెక్నాలజీ వుండిఉండేదో ఆలోచించండి.
ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర వున్న గొప్ప అంతరిక్ష పరిశోధన శాల చూసి పాశ్చాత్యులు విస్తుపోయారు. వాటి గురించి మరొక టపాలో చెప్పుకుందాము.

లీలావతి గణితం లో భాస్కరాచార్యుల వారు గ్రహాలు నిలబడాలంటే దానికి వాటి అయస్కాంత శక్తే కారణమని సిద్ధాంతం చెప్పారు. ఒకొక్క గ్రహం మరొక గ్రహంతో సంబంధిత శక్తి ద్వారా వాటి నిర్దేశిత కక్ష్యలో తిరుగుతున్నాయి. అలాగే కిందకు పడుపోకుండా ఒక నిర్దుస్త కక్ష్యాల్లో తిరగడానికి శక్తే కారణం. ఆది శంకరుల వారు ఆ శక్తికి మహా మాయ అని పిలిచారు. 

ఐంస్టీన్ ఆయన స్పేస్ టైం మాత్రిక గురించి చెప్పినప్పుడు దాన్ని ఈ శక్తికి అనుసంధానిస్తే ఆ మాత్రిక ఒక పాము పడగలా కనబడుతుంది. కింద ఇచ్చిన బొమ్మను ఒకసారి పరికించగలరు.
శంకరుల వారు చెప్పిన ఆ శక్తే , పునానాల్లో చెప్పే ఆది శేషువు, ఐన్స్టీన్ చెప్పిన స్పేస్ టైం మాట్రిక్స్ ఒకదానికి ఒకటి సంబదితంగా కనపిస్తుంది.
అలాగే సహస్ర పడగల మీద అనంతుడు ఈ బ్రహ్మాండాన్ని భరిస్తున్నాడని సిద్ధాంతం. 
సహస్రం అంటే అనంతం. వెయ్యి మాత్రమె కాదు. అనంతమైన ఇటువంటి స్పేస్ టైం మత్రిక్ష్ ఎలెమెంట్స్ ద్వారా ఈ గ్రహాలూ నక్షత్రాలు నిలబడి వున్నాయి.
మనం ఇప్పుడు చూస్తున్న ఈ 9 గ్రహాల యూనివర్స్ మరెన్నో వున్నాయి. ఈ యూనివర్స్ అండాకారం (ఓవల్) గా వున్నది అనడానికి మరొక నిరూపణ మనం ఇప్పుడు చూస్తున్న గ్రహాల కక్ష్యలన్నీ ఏవి వృత్తాకారం లో లేవు, అన్నే elliptical orbits. అలాగే ఇటువంటి సోలార్ సిస్టమ్స్ మరెన్నో వున్నాయి. 

ఇప్పుడు మనం తెలుస్కున్నది సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమె. ఇటువంటి నక్షత్రాలు ఎన్నో మరెన్నో వున్నాయని. ఇటువంటి పాల పుంతలు మరెన్నో వున్నాయని. 
మొన్నటికి మొన్న కెప్లెర్52 గ్రహం భూమిని పోలి వుందని. మనమిప్పుడు ఔనా అని ఆశ్చర్యపోతున్నాం. కానే దీని ప్రస్తావన మనకు ఎన్నో పురాణాల్లో లభిస్తోంది.

దేవి భాగవతం ప్రకారం ఇటువంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల లో వున్నాయి. కొన్ని కోట్ల త్రిమూర్తులు వాటిని పాలిస్తున్నట్టు చెప్పి వున్నది.
శేష అంటే సంస్కృతంలో అన్ని పోగా మిగిలున్నది అని అర్ధం. అటువంటికి అన్ని పోగా మిగులున్నది ఒక్క మాయ ( శక్తి ) మాత్రమె. అది మాత్రమె గ్రహాలను వాటి కక్ష్యలో వుండేటట్టు చేస్తున్నది. ఇదే ఆది శేష తత్వం.

మరొక పోలిక చెప్పి ముగిస్తాను. మనకున్న కుండలినీ శక్తిని షట్చక్రాలను శేష రూపంగానే చెబుతాము. ఇక్కడ శక్తి ని పాము రూపంలో చూపిస్తున్నాము. మనమే కాదు లేటెస్ట్ డాక్టర్ సైన్ చూసినా మీకు కలిసున్న రెండు పాముల రూపంలో చూపిస్తారు. మైక్రోకాస్మ్ లో మనం చూస్తున్నదే macrocosm లో వున్నది. అంటే పరమాణు రూపంలో లో అనువు, nucleus, ఎలెక్ట్రోన్ లు తిరగడం మనం గ్రహాలలో చూస్తున్నాము. ఇటువంటి మన వేనుపాము (పిండాండం) లో వున్న శేషావతారం లో వున్నా శక్తి బ్రహ్మాండంలో వున్నది. 

కాబట్టి ఆ అనంతమైన శక్తినే సంకేతార్ధంలో ఆది శేషువు గా మనం చెప్పుకుంటున్నాము. ఆయనే అంతటా నిండి వున్నా శక్తి. అన్ని చోట్ల వ్యాపించి వున్నవాడు – విష్ణువు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore