భగవద్గీత సూక్తి - శ్రేష్ఠుడు
ప్రత్యుపకారమును కోరకయే మేలు చేయు వారి యందు,
ప్రతిఫలమును కోరి మేలు చేయు వారి యందు,
శత్రువులందు, తటస్థులందు, మధ్యవర్తులందు,
విరోధులయందు, బంధువులందు, సజ్జనులందు,పాపులందు,
సమభావము కలిగియుండువాడే శ్రేష్ఠుడు.