భగవద్గీత విశిష్టత
భగవద్గీత
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణంమమ
అనే అనన్యభక్తి భక్తుడిని అలవాడాలన్నది
శ్రీకృష్ణుడి సిద్ధాంతం
దేనికైనా ఆర్తి ముఖ్యం
ప్రేమ. సఖ్యం సహనం క్షమ. గర్వం లేకపోవటం
వంటి లక్షణాలున్న వారికి విజయం కొంచెం
పరీక్ష పెట్టినా చివరికి వరించి తీరుతుంది
ఇవి లేనివాళ్ళు తాత్కాలికంగా భోగాలు
పొందినా చివరికి అపజయం, అపకీర్తిపాలు
అవుతారని శ్రీకృష్ణుడి ఉవాచ …………
ఎవరికైనా మృత్యువు సంభవించినపుడు
భగవద్గీతను పారాయణం చేయాలి ( అపోహ. )
ఇది ఏ. మాత్రం నిజం కాదు …..వాస్తవానికి అమృతత్వాన్ని
సాధించగోరేవారికే భగవద్గీత గాని …….
మృతులకు కాదు ……
భగవద్గీత. పారాయణం మనిషి
ఉన్నప్పుడు చేస్తే లేదా అతనితో చేయిస్తే …
ఇంకా సాధ్యమైతే అతనితో అనుసరింపజేస్తే
లాభం కలుగుతుంది గాని
మరణించిన తరువాత. కాదు. ……
దాని ద్వారా అపవిత్రమైన. ఆ ప్రదేశం
పవిత్రమౌతుంది గాని జీవుడికి ఎట్లా లాభం
కలుగుతుంది …… అయితే ఆ సందర్భానికి
వచ్చిన. బంధువులకు మాత్రం కొంత
వైరాగ్యం కలిగే అవకాశం ఉంది
భగవద్గీతను కేవలం మృత్యువు సంభవించిన
సందర్భాలలో పఠించడమనే పద్ధతిని
అందరు ఆపి ఇంట్లో సుఖంగా ఉన్నప్పుడే
ప్రారంభించాలి దాని ద్వారా సకల
శుభాలను పొందాలి