పోలికలు మాకెందుకు...!
అధిక రక్తపోట్లూ, మధుమేహాలు,కాన్సర్ మహమ్మరులు మనిషిని చంపే వ్యాధులైతే...
అసూయ ఆత్మస్తుతి పరనిందా వ్యక్తిత్వాన్ని మింగే మహజాఢ్యాలు..
పక్కింటి వాడు కారు కొంటే అసూయ,
పక్కసీటువాడిని పదోన్నతి వరిస్తే కడుపు మంట,
ఎవరి పిల్లాడో చదువుకొని వృద్ధిలోకి వచ్చినా ఏడుపే!
సెల్లు ఎన్నoగుళాలు,ఇల్లు ఎన్ని గజాలు-
మనుషుల్ని అంచనా వేయడానికి ఇవే మా తూకంరాళ్లు!
నువ్వెప్పుడైనా బాధపడ్డవా..?
విష్ణుమూర్తిలా వైభోగాల వైకుంఠము లేదనీ,
ఇంద్రుడిలా కామధేనువు, కల్పవృక్షాలు నీ గొడ్ల చావిడిలో లేవనీ,
సాక్ష్యాత్తు కుబేరుడు సైతము నీ ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు కదా మహాదేవా..
కానీ నీ దారి నీది,నీ ధోరణి నీది...
మరి ఈ దిక్కుమాలిన పోలికలు మాకెందుకు...!
నీలా నిర్మలంగా,నిరాడంబరంగా బతకడం నేర్పించు శివా!..