స్త్రీ జాతకము
స్త్రీ జాతకము - కొన్ని విషయములు.
స్త్రీ జాతకమున లగ్నము చంద్రుడు సమరాసులలో నుండి, శుభగ్రహ వీక్షణ కలిగియున్న అట్టి స్త్రీలు, మంచిసంతానము, ఉత్తమ భర్త, ఆభరణములు సంపదలు కలిగి యుందురు. లగ్నము చంద్రుడు బేసిరాసులలో నున్న, ఆ రాసులలో పాపులున్న, లేక పాపగ్రహములు చూచుచున్న అట్టి స్త్రీలు, మోటుదనము, మృదు భాషణ లేక, భర్త ఆజ్ఞలను తిరస్కరించు దరిద్రురాలగును. సప్తమ రాసి శుభాగ్రహ అంశయందున్న అట్టి స్త్రీకి, ప్రకాశమానుడు, విద్యావంతుడు, ధనవంతుడు అగు భర్త లబించును. అందుకు వ్యరిరేకమైన అనగా సప్తమ రాసి పాపగ్రహ అంశయందున్న, భర్త అంగవికలుడు, జూదరి మోసగాడు ఆస్తిపోగోట్టువాడు అగునును. అష్టమమున పాపులున్న స్త్రీ భర్తకు నాశనము కలుగును. ద్వితియభావమున పాపులున్న స్త్రీ మరణము పొందును. వివాహపొంతనాలు చూచు నప్పుడు ఈ విషయములు క్షుణ్ణంగా పరిసీలించవలెను
.
చంద్రుడు వ్రుచ్చిక, కన్యా, వృషభ, రాశులలో ఉన్న ఆ రాసులు పంచమములయిన, అట్టి స్త్రీకి స్వల్ప సంతానము కలుగును. సప్తమము కాని సప్తమనవాంశ కానీ పాపగ్రములు రవి, కుజ, శనులు, సంభందమున్న అట్టి స్త్రీకి జననేంద్రియ వ్యాదులుండును. సంతానము ఎక్కువ లేక కలగుట కష్టము. పాపగ్రహము చతుర్ధమున ఉండరాదు. లగ్నము, చంద్రుడు, కుజుడు, శని రాసులడున్న,నవాంశమందున్న అట్టి స్త్రీలు కులట/ వ్యభిచారిణి అగు ఆవకాశమున్నది. సప్తమరాశి గాని నవాంశగాని, శుభాగ్రహ సంభందము గలిగిన ఆతి స్త్రీ సౌందర్యవతి, అదృష్టవంతురాలు అగును. లగ్నము, చంద్రుడు, శుభగ్రముల తో యున్నాను,, శుభగ్రహములు త్రికోణములందున్నను ధనవంతురాలు, సంతానవతి, శుభ స్వభావము కలది యగును. ఈ సప్తమ నవాంశల బలము ముఖ్యముగా చూడవలెను
-
రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి