Online Puja Services

అభిగ్య ఏం చెప్పాడు?

3.144.99.0

వైరస్ పై అభిగ్య జ్యోతిషం వైరల్

ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిగ్య. ఏడు నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిషం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

 అతను చెప్పేది నిజమేనా, జ్యోతిషంలో అతనికి అంత పాండిత్యముందా అని నన్ను అందరూ అడగడంవల్ల ఈ పోస్టు పెడుతున్నా. అభిగ్య ఆనంద్ వీడియోలు చూసిన తరువాత నాకు అనింపించింది ఏమిటంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే ఇదేనని. పదేళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని 700 శ్లోకాలను అనర్గళంగా వల్లెవేయడం, జ్యోతిషం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పడం మామూలు విషయం కాదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. 

అతనిది మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రమణియన్, తల్లి అన్ను ఆనంద్. అతి చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని అవుపోసన పట్టడం అభిగ్య ఆనంద్ ప్రత్యేకత. ఇప్పుడతని వయసు 14 ఏళ్లు. గుజరాత్ లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేదవిశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత చిన్నవయసులో నియమితుడవడం మామూలు విషయం కాదు. అతని సోదరి అభిదేయకు కూడా ఇలాంటి ప్రతిభాపాటవాలు ఉన్నాయి. అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డును అందుకున్నాడు. ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ చేశాడు. జ్యోతిషంలోని వివిధ విధానాల మీద అనేక పరిశోధనలు చేశాడు. వాస్తు లోనూ నైపుణ్యం సాధించాడు. విశ్వమ్ వాస్తుమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తున్నాడు.

అతను ఏం చెప్పాడు? 

గ్రహస్థితిగతులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని అతను ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పాడు. దీనిపై 7 నెలల క్రితమే అతను ఒక  వీడియో కూడా చేశాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని కూడా అతను ప్రకటించాడు. చైనా యుద్ద సమస్యను ఎదుర్కొంటుందని అతను ప్రకటించాడు. ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రకటించాడు. అతని జ్యోతిష విధానం చాలా లాజికల్ గా ఉంది. కొందరు జ్యోతిష పండితులు అతన్ని ఇంటర్వ్యూ చేసినపుడు అతను చెప్పిన సమాధానాలు చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న వయసులో ఈ శాస్ర్తం మీద ఇలా ఎలా చెప్పగలుగుతున్నాడని అనిపించింది. ముఖ్యంగా ప్రశ్నశాస్ర్తం మీద కూడా అతనికి మంచి పట్టుంది. అతను చేసిన వీడియోల లింక్ పెడుతున్నాను చూడండి. అలాగే ఫైనాన్షియల్ అస్ట్రాలజీలోనూ అతను దిట్ట. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కూడా అతను చక్కటి విశ్లేషణ చేశాడు. గత జన్మలను నమ్మనివారు కూడా అతని వీడియోలు చూస్తే తమ అభిప్రాయాలను మార్చుకుంటారేమో. ఇక ఇప్పుడున్న పరిస్థితుల గురించి అతను చాలావరకు చెప్పాడు. దీంతో పాటు నా విశ్లేషణ కూడా మరో పోస్టులో పెడతాను.

https://www.youtube.com/watch?v=jynGnm5o_SE
 
https://www.youtube.com/watch?v=qzybQGOTIyE

 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha