Online Puja Services

శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే..!!

18.117.188.105

శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే..!!                              

వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - కర్మ తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఆయన నివసించేది వేంకటాచలం .  సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం

త్రేతా యుగం - శ్రీరాముడుగా,

ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,

కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. పాపసంహారం చేసి , కలియుగ రక్షకులై వేంచేశారు . .ఆయన ఉన్న తురుమలకి యుగాల చరిత ఉందంటారు పండితులు . తిరుమల  కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేదని చెబుతారు . 

కృత యుగం లో - వృషా చలం,

త్రేతా యుగం లో - అంజనా చలం

తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. 
యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

ఒకప్పుడు  శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంగా  మాట్లాడేవారట ! కానీ తొండమానుడి అపరాథం వల్ల స్వామి మౌనం వహించారట . 
     
 పూర్వం "కూర్ముడు" అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ, తాను తిరిగి వచ్చే వరకూ తన భార్యాపిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడు. 

ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి, భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మరిచిపోయాడు. ఆ భవనంలోనివారు ఆహారం చాలక లోపలే మరణించారు. ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. 

ఆ విషయమే మరచిన తొండమానుడు, భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి, వేంకటాచలానికి పరుగెత్తి వెళ్ళి, శ్రీనివాసుని పాదాలపై పడి శరణువేడాడు. 

అప్పుడు  శ్రీవేంకటేశ్వరుడు "నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను.ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను" అంటూ శపధం చేసి, ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు.
    
అప్పుడు బ్రహ్మాదిదేవతలు "బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతము వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసింది" అని ప్రార్ధించారు. 

అప్పుడు శ్రీనివాసుడు "దివ్యమూర్తిగా దర్శనమిస్తాను. కానీ ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను" అంటూ "కన్యామాసం, శ్రవణానక్షత్రం" రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. 

తొండమానుడు ఆలయగోపురాదులు నిర్మించాడు. 
   
 బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వేలుగుతూంటాయని చెప్పాడు. తరువాత పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించాడు. 

అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి.

(సేకరణ)
లక్ష్మి రమణ 

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda