Online Puja Services

షోడశ కళానిధికి షోడశోపచారములు

18.190.160.6

షోడశ కళానిధికి షోడశోపచారములు సమర్పయామి !
- లక్ష్మీ రమణ 

షోడశ కళానిధికి షోడశోపచారములు సమర్పయామి ! అంటూ శ్రీవారికి చేసే పదుహారు ఉపచారాలు గురించి అద్భుతంగా ఒక జావళిలో వివరిస్తారు అన్నమయ్య .రావయ్యా మాయింటికి అని ఆహ్వానించిన తర్వాత ఆ పరమాత్ముని ఎలా సేవించుకోవాలె , ఎన్ని విధాలుగా ఉపచారాలు చేయాలో ఆ జావళిలో చక్కగా వివరిస్తారు ఆ మహా భక్తుడు .  ఉపచారాలు అంటే సేవలే . 16 రకాల ఆ ఉపచారాలు గురించి తెలుసుకుందామా !

ఆవాహనం- ఆవాహయామి అన్నమంటే, ఆహ్వానం పలుకుతున్నామని అర్థం . ఇంటికి అతిధి వచ్చినప్పుడు స్వాగత సత్కారాలు చేస్తాం కదా ! అలాగన్నమాట . 

ఆసనం- ఇక్కడ ఆహ్యానించినది భక్తుడు , విచ్చేసింది భగవంతుడు కాబట్టి పుష్పమైనా ఆసనంగా సమకూరుతుంది .లేకపోతె ,  అణువూ అణువునా నిండిన వాడికి బ్రహ్మాండం అంత పీట వేయడం మన తరమా ? 

పాద్యం- కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లివ్వాలి . సృష్టిలోని జలమే తానైనవాడికి, బొటనివేలినుండీ గంగని ఉద్భవింపజేసినవానికి ఎన్నినీళ్లతో కాళ్ళుకడగాలా అని ఆలోచించకండి ! ఒక్క ఉద్ధరిణె చాలవూ !1
  

ఆర్ఘ్యం- చేతులు కడుక్కునేందుకు నీళ్లివ్వాలి . అదికూడా ఒక ఉద్ధరిణె తో సరి !

ఆచమనీయం- ఇంటికొచ్చింది వాసుదేవుడైతే మాత్రం , దాహం అడిగామా ఏంటి ? పైగా భారతఖండములో పుట్టిన సంస్కారవంతులం .  కాబట్టి మంచినీళ్లివ్వాలి దాహానికి . అది మరో ఉద్ధరిణె నీళ్లు చాలు . విశ్వమే తానైనవాడుకదా ! అదే ఎక్కువ మరి !!

స్నానం - స్నానానికి నీళ్లిచ్చి ,

వస్త్రం- నూతన వస్తాలనిచ్చి ,

యజ్ఞోపవీతం-  బ్రహ్మాండాలన్నీ క్రాస్ చేసి , లోకాలన్నీ బైపాస్ చేసి వచ్చే దారిలో మైలపడ్డ యజ్ఞోపవీతాన్ని మార్చుకుందుకు వీలుగా కొత్త యజ్ఞోపవీతాన్ని ఇవ్వడం మనధర్మం . యెంత బ్రహ్మాండ  నాయకుడైతే మాత్రం , అంతదూరంనుండీ మనకోసమెగా వచ్చేశాడు . ఒక్కసారి గజరాజుని  రక్షించడానికొచ్చిన విష్ణుమూర్తిని తలుచుకోండి . పిలుపు వినగానే పరిగెత్తుకొచ్చే స్వామికదా ! మానవ బుద్దితో , మనం మన ధర్మాన్ని , నిర్వర్తించాలి . సలక్షణంగా స్వామిని గౌరవించుకోవాలి . 
 

గంధం- ఆపై సుగంధపూరితమైన గంధాన్ని , 

పుష్పం- అలంకారణార్థం పుష్పాన్నీ సమర్పించాలి . 

ధూపం- తర్వాత ధూపం ,

దీపం- దీపం సమర్పించాలి .  జ్యోతిగా ఉన్న ఈ ఆత్మా కర్మసంచయనాలన్నీ దగ్ధం చేసి పరంజ్యోతివైన నీలో కలుపుకోవయ్యా అని అర్థించాలి . 

నైవేద్యం- అనంతరం భోజనం , 

తాంబూలం- తాంబూల చర్వణం . 

నమస్కారం

ప్రదక్షిణం

ఉపచార విధానం పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారో అలానే షోడశోపచారములలో  భగవానుని గౌరవించడాన్ని గమనించవచ్చు . అందుకే ఒక్కమాటలో మనవాళ్ళు అంటారు ‘అతిథి దేవో భవ అని ! ఈ ఉపచారాలు విధానం చూస్తే, అది అక్షరసత్యమని అనిపిస్తోంది కదూ !!

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda