Online Puja Services

శ్రీ సుబ్రమణ్యస్వామి చరితం.....4 వ.భాగం

18.221.49.39
సుబ్రమణ్య స్వామి గురించి, జన్మ గురించి అనేక కథనాలున్నాయి. అన్నీ వేరు వేరు కథలైనా పుట్టుకతో ఆరుముఖాలు, పండ్రెండు చేతులు అనిమాత్రం నిర్ధారణగా చెప్పబడింది. పరమశివుడికి పుత్రుడుగాను రూఢీగా చెప్పబడినది. ఏది ఏమైనా దేవతల పుట్టుకల గురించి విచారణ చేయరాదని ఆర్యోక్తి.

అథర్వణ వేదంలో ఆయనను కుమార అగ్నిభూత అని వ్యవహరించినట్లు వారు చెబుతారు. దీనికి కారణం సుబ్రహ్మణ్యుడు పుట్టినప్పుడు అగ్నిలా ఉన్నాడని, మూలాన్ని అగ్నియే మొదట మోసాడని చెబుతారు. 

శతపథ బ్రాహ్మణం ఆయనను రుద్రుని కుమారునిగా, రుద్రుని ఆరు ముఖాలకు ప్రతీకగా వర్ణించింది.
తైత్తరీయారణ్యకం గాయత్రి మంత్రంతో సుబ్రహ్మణ్యుని పోలుస్తుంది. ఛాందోగ్యోద్యుపనిషత్‌ ఆయనను జ్ఞానానికి మార్గదర్శిగా పేర్కొంది. బోధాయన ధర్మ సూత్రం ఆయనను మహాసేనుడు అని వర్ణించింది.     ఉపనిషత్తులు చాలా చోట్ల గుహ అనే పేరుగల అందరిలోనూ ఉన్న ఒక మహోన్నత చైతన్యమూర్తి గురించి పేర్కొంటుంటాయి.

మహాభారతంలోనూ, స్కాంద పురాణంలోనూ, దేవీ భాగవతంలో ఆయన గురించి వివరంగా వ్రాసి ఉందని విజ్ఞులు చెబుతారు.

శివుని కుమారుడుగా దేవ సేనాపతిగా మరెన్నో విధాలుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కార్తిక శుద్ద షష్ఠినాడు ఆయన ఆరాధన చేసే ఆచారం ఉంది. శ్రావణమాసంలోనూ ఆయనను ఇదేవిదంగా కొన్ని ప్రాంతాల్లో ఆరాధిస్తారు. దీనినే వారు సుబ్రహ్మణ్య షస్ఠి అంటారు. 

ఆయనకు అనేక పేర్లున్నాయి. వాటిలో కార్తికేయ (కృత్తికల కుమారుడు), స్కంద (దాడి చేయువాడు), కుమారన్‌ (యువరాజు, చిన్నవాడు ), స్వామినాథ (దేవతలకు రాజు), శరవణ (నీటి మొక్కల మధ్య పుట్టినవాడు, షణ్ముఖ లేదా ఆర్ముగం (ఆరుముఖాలు కలవాడు), దండపాణి (దండం చేత ధరించినవాడు ), గురు గుహ లేదా గుహన్‌ (గుహలలో నివసించువాడు), మహాసేనుడు (పెద్ద సేనకలవాడు)వంటి పేర్లు ఉన్నాయి. 

ఇక ప్రాంతీయంగా మురుగన్‌ (యువకుడు), వేలన్‌(శక్తి ఆయుధం కలవాడు) కుమరన్‌ అనేవి కొన్ని. పురాణ వాంగ్మయంలో మరికొన్ని పేర్లున్నాయని పెద్దలు చెబుతారు. 

దేవసేన, శ్రీవల్లి ఆయనకు భార్యలని చెబుతారు. సుబ్రహ్మణ్యునికి షష్ఠీ తిథి ప్రీతికరం. ఆయన తారకాసురునిపై విజయం సాధించినది ఆ తిథి నాడే. అందునా అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రం ప్రధానంగా గల ఈ మాసంలో అగ్నిగర్భుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మరింత పుణ్యప్రదం.        తమిళనాడులో సుబ్రహ్మణ్యారాధన ఎక్కవ. అలాగే తమిళులు ఎక్కువగా ఉండే శ్రీలంక, మారిషస్‌, ఫిలిప్పీన్స్‌, ఇండొనీషియా, మలేషియా, సింగపూర్‌లలో ఆయన ఆరాధన ఉంది.

కార్తికేయుని జననం గురించి వేరేవేరు కథలు:---

ఒక అసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణాన్ని కోరుకున్నాడని. అయితే శివుడు, పార్వతి ఎక్కువ కాలం ఏకాంతంలో ఉండడంతో వారిని బయటకు రప్పించేందుకు అగ్నిని దేవతలు పంపారని, అగ్ని వారి ఏకాంతానికి భంగం కలిగించడంతో శివుని వీర్యం బయటకు వచ్చిందని, మహాతేజస్సండుపన్నమైన దానిని అగ్ని దేవుడు తీసికెళ్ళి భద్ర పరిచాడని చెబుతారు. అయితే ఎక్కువ కాలం దానిని భరించలేక నీటిలో వదలగా, నీరు కూడా దానిని భరించలేక భూమి మీదకు ఒడ్డుకు చేర్చిందని రెల్లు గడ్డిలో ఆయన బాలుని రూపం ధరించారని కృత్తికలు ఆయన రక్షణ బాద్యత వహించాయనేది ఒక కథ.

మరో కథ ప్రకారం ఆయన అగ్నిదేవుని కుమారుడని ఆయన వేర్వేరు రుషిపత్నుల రూపాలు ధరించినపుడు స్ఖలితమైన అగ్ని శక్తి నుంచి పుట్టాడని చెబుతారు.

మరో కథ ప్రకారం ఒక అసురుడు శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ఏమి కావాలని కోరగా తనను శివుని శక్తి మినహా ఏదీ సంహరించలకుండా వరం కోరాడు. వాడు ఆ వరం బలంతో మానవులను, దేవతలను వేధించసాగాడు. దేవతలు అందరూ శివుణ్ణి ప్రార్థించగా ఆయన మూడో కన్ను తెరిచాడు. దానితో అసురుడు భస్మం అయ్యాడు. అయన మూడో కన్ను నుంచి వచ్చిన అగ్ని శిఖ గంగానది తీరంలోని శరవణ అనే చెరువులో గల ఆరు పద్మాలలో స్థి ర పడిందని చెబుతారు. ఆ ఆగ్ని ఆరు బాలురు అయిందని, అగ్ని ఆజ్ఞ మేరకు ఆరుగురు కృత్తికలు వారిని సంరక్షించారని చెబుతారు.      చివరకు ఆ బాలుడే ఏకరూపుడై సుబ్రహ్మణ్యునిగా వెలిశాడని వేర్వేరు కథలున్నాయి.           సుబ్రహ్మణ్యుడు శివుని సన్నిధిలో ఉన్నా బ్రహ్మ ఆయనను సరిగా పలకరించే వాడు కాదని కథ.    అందువల్ల బ్రహ్మదేవుని గొప్పతనం పరీక్షించేందుకు సుబ్రహ్మణ్యుడు ఆయనను ఓం అసలు అంతరార్థం చెప్పమన్నాడు. బ్రహ్మ వివరణ ఆయనకు రుచించక ఆయనను బంధించాడు. ఇది శివునకి తెలియగా ఆయన సుబ్రహ్మణ్యుని పరీక్షించేందుకు ఆతనినే అంతరార్థం వివరించి చెప్పమన్నాడు. ఈ కథ ఆధారంగానే తమిళనాడులోని స్వామి మలై క్షేత్రం వెలిసింది. అక్కడ శివుడు శిష్యునిగా స్కందుడు గురువుగా ఓంకారం అర్థం వివరించాడని చెబుతారు. 

స్కందుని ఆయుధం శక్తి (వేల్‌ ). ఆయనకు పార్వతీదేవి శక్తి ఆయుధం ఇచ్చిందని చెబుతారు. దానితోనే ఆయన తారకాసురుణ్ని, సింహ ముఖాసురుణ్ణి వధించాడు. ఆయన సంహరించిన ఒక అసురుడు రెండు రూపాల శరీరాలతో ఉండేవాడు. వాడి శరీరంలోని ఒక భాగం కోడి రూపంలో ఉండేదని మరో రూపం నెమలి గా ఉండేదని, దానిని రెండు భాగాలు చేసి కోడి రూపాన్ని తన ధ్వజo  మీద నెమలిని తన వాహనంగా సుబ్రహ్మణ్యుడు చేసుకున్నాడని చెబుతారు.

* స్వామి ఆలయాలు, అనగా ఆరు దివ్యక్షేత్రాలు గురించి *

- L. Rajeshwar 
 
 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba